Suriya: క్రేజీ కాంబోలో మరో చిత్రం.. సూర్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) ఇటీవల ‘రెట్రో’(Retro) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి అశించినంతగా అలరించలేకపోయాడు. దీంతో ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం ‘సూర్య-45’(Surya-45) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీలో సూర్య నటిస్తున్నాడు. ఈ మూవీకి డైరెక్టర్ ఆర్జే బాలాజీ(RJ Balaji) దర్శకత్వం వహిస్తుండగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాష్ రాజ్(SR Prakash Raj), ఎస్. ఆర్ ప్రభు(SR Prabhu) నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సూర్య సరసన సీనియర్ బ్యూటీ త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా, సాత్విక(Sathika), యోగి బాబు(Yogi Babu), నట్టి(Natti), అనఘా రవి(Anagha Ravi)(కోలీవుడ్ ఎంట్రీ) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 

నెట్టింట టైటిల్ పోస్టర్ వైరల్

 

ఇదిలా ఉండగా ఇది సూర్య-బాలాజీ కాంబోలో వస్తున్న మూడో చిత్రం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్(AR Rahman) మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘పెట్టైక్కరన్(Pettaikkaran)’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు రాగా.. ఇప్పుడు ఈ సినిమాకు ‘వెట్టై కరుప్పు(Vettai Karuppu)’ అనే టైటిల్‌ను లాక్ చేసినట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాకుండా దీనిపై తర్వలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *