హైదరాబాద్:ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు మద్దెల సంతోష్ ముదిరాజు BJP పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. జనగామ రాజకీయాల్లో గడిచిన 15ఏళ్లుగా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. విద్యార్ధుల విద్య అవసరాలు కోసం ముందుండి సాయం చేసి యువత మన్ననలు పొందారు.బలబైన బీసీ నేతగా జనగామలో ఉన్న మద్దెల సంతోష్‌కి బీజీపీ టిక్కెట్ ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తుంది.
అధికార పార్టీ MLA ముత్తిరెడ్డి ఆరాచకాలు, భూకబ్జాలతో ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు మరోమారు BRS విద్యా దోపిడీదారు పల్లా టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ సంకేతాలు ఇవ్వడం పట్ల స్థానికుల్లో వ్యతిరేకత మొదలైంది.
BC నేతగా ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిగా మద్దెల సంతోష్ ముదిరాజ్ BJP పార్టీ అభ్యర్ధిగా రేసులో ముందువరుసలో ఉన్నారు. బలమైన ఓటు బ్యాంక్ కలిగిన BC సామాజిక వర్గంతో పాటు విద్యార్థులు సంతోష్ గెలుపు కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడంతో కాంగ్రెస్‌తో ఉన్న సంబంధాలు సంతోష్ గెలుపుకు తోడు అవుతాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అంతేగాకుండా ముదిరాజు సామాజికవర్గం నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. జనగామ గడ్డ పై ఈ సారీ కమలం జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేగాకుండా ఈటెల రాజేందర్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు మరింత కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.