హైదరాబాద్: అదిలాబాద్ జిల్లాలో జరిగిన జనగర్జన సభలో అమిత్‌షా సాక్షిగా బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్‌నే CM కావాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒక్కసారిగా సభా వేదికపై మీద నేతలు ప్రజలు ఉత్సహాన్ని చూసి ఆసక్తిగా గమనించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు.
మన ముఖ్యమంత్రిని ఆయన కొడుకు కేటీఆర్ ఏమైనా చేసిండోనని అనుమానం కల్గుతుందని ఆరోపణలు చేశారు. కేసీఆర్ నాకు గురువు ఆయన నుంచే మాటలు నేర్చుకున్నానని తెలిపారు. నా గురువు క్షేమంగా ఉండాలి. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అమలు సాధ్యం కానీ హామీలతో అతి గతీ లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందన్నారు.రూ.5లక్షల కోట్ల అప్పు తెచ్చి కేసీఆర్ ఏమీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.