మన ఈనాడు: భారతీయ జనతా పార్టీ అగ్రనేతల వరుసగా పర్యటనలు చేస్తున్నారు. నేతలతో ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు. కార్యకర్తల్లో సరి‘కొత్త’ ఉత్సాహం నింపడానికి బహిరంగ సభలు పెడుతున్నారు. తెలంగాణలో BJP ఫుల్ జోష్‌తో పరుగులు పెట్టిస్తుంది. అభ్యర్థుల లిస్టు విడదల చేసే అంశంలో భాజపా వేగం పెంచింది. మొదటి జాబితాపై కసరత్తు పూర్తి చేశాయి.పార్టీలో చేరికలపై కూడా దృష్టి సారించాలని ప్రత్యేంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షానే టీ బీజేపీ నేతలకు సూచించారు. దీంతోపాటు తెలంగాణలో వరుస సభలకు ప్లాన్ సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
అమిత్ షాతో కిషన్ రెడ్డి, ప్రకాశ్ జవదేకర్.. ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని వాళ్లకు అమిత్ షా సూచించినట్లు చెబుతున్నారు. ఇక స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు. ఈ క్రమంలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా తయారీలో బీజేపీ స్పీడు పెంచింది. ఈ నెల 15న మొదటి జాబితా ప్రకటించనుంది. మొత్తం మూడు విడతల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సమాచారం. దసరా రోజు 40 మందితో రెండో జాబితా విడుదల చేస్తారు. కాంగ్రెస్ జాబితా తర్వాత బీజేపీ మూడో లిస్ట్ వస్తుందని తెలుస్తోంది.
నవంబర్ చివరివారంలో బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో ప్రధాని మోదీతో భారీ రోడ్ షో నిర్వహించేందుకు టీ బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక తెలంగాణలో బీజేపీదే విజయం అంటూ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో తామే అధికారం చేపడతామని తెలిపారు.