మన ఈనాడుః గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై బాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. ఇప్పటకైనా యువత స్పందించి కేసీఆర్‌కు పుల్‌స్టాఫ్ పెట్టే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. శనివారం నాడు బాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమంలో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అశోక్ నగర్‌లో యువతి ఆత్మహత్యపై భారసపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి మాత్రం ప్రగతి భవన్ కే పరిమితం అయ్యారని విమర్శలు గుప్పించారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం దారుణం అన్నారు. ప్రవళిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ‘పరీక్షలు వాయిదా పడుతున్నాయి. మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారు.’ అని వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్‌లో బాధపడిందని చెప్పారు బండి సంజయ్.
* సీటీల్లో ఉన్న యువత కొచింగ్ సెంటర్లు వదిలి నవంబర్ 30న ఇళ్లకి వెళ్లాలని బండి సంజయ్ సూచించారు. మీతోపాటు మీ కుటుంబసభ్యలు కమలం గుర్తకు ఓట్లు వేసేలా చూడాలని కోరారు. అప్పుడే యువత, రైతుల వ్యతిరేఖ సర్కారు కేసీఆర్ ను శాశ్వతంగా ఇంటికి దగ్గరే ఉంచే అవకాశం వస్తుందని తెలిపారు.
ఆమె మృతికి నిరసనగా అశోక్ నగర్‌లో రోడ్డపై యువత మొత్తం వచ్చారని, దీనిపై వాస్తవాలు తెలుసుకుందామని లక్ష్మణ్, భానుప్రకాష్ వెళ్లారన్నారు సంజయ్. అయితే, వీరందరి రాక ప్రభుత్వానికి నచ్చక పోలీసులతో లాఠీ చార్జీ చేశారన్నారు. లక్ష్మణ్‌ను ఎంపీ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని.. ఈసారి గనుక అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజల సంగతి అంతేనని అన్నారు.