తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో ఎమ్మెల్యేగా(MLA) పోటీ చేసే వారు తమ అఫిడవిట్ పత్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన నిబంధనల ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తుల, కేసుల వివరాలు రిటర్నింగ్ అధికారులకు ప్రకటించాలి.దీంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన రెండు సెట్ల అఫిడవిట్లను దాఖలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే వారు తమ అఫిడవిట్ పత్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన నిబంధనల ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తుల, కేసుల వివరాలు రిటర్నింగ్ అధికారులకు ప్రకటించాలి. ఈ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR)తన రెండు సెట్ల అఫిడవిట్లను దాఖలు చేశారు. అందులో తన ఆస్తుల, అప్పుల వివరాలను పేర్కొన్నారు.
నామినేషన్ తరువాత కామారెడ్డి బహిరంగ సభలో తమ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈరోజు ఏకాదశి మంచి ముహూర్తం చూసుకుని గజ్వేల్ ఆర్టీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. ఈ అఫిడవిట్లలో పొందుపరిచిన ఆస్తులు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల అఫిడవిట్లో నమోదు చేసిన వివరాల ప్రకారం కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. తెలంగాణ కోసం పోరాడే సందర్భంలో ధర్నాలు, బంద్‌లతో పాటూ రాస్తారోకోలు నిర్వహించారు. దీని కారణంగా కేసులు నమోదు చేశారు పోలీసులు.
వాహనాలు.. బంగారు ఆభరణాలు
కేసీఆర్ పేరు మీద ఒక్క బైక్, కారు లేదని హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, జేసీబీతో పాటూ ఇతర వాహనాలు ఉన్నాయి. వీటి మొత్తం సంఖ్య 14గా పేర్కొన్నారు. వీటి విలువ రూ. 1.16 కోట్లుగా పొందుపరిచారు. ఇక బంగారం విషయానికి వస్తే.. 2.8 కేజీల బంగారం ఉన్నట్లు వాటి విలువ రూ. 17లక్షలుగా వెల్లడించారు. తనతోపాటూ తన భార్యకు ఒక సెంటు భూమి కూడా సొంతంగా లేదన్నారు. అందరికీ కలిపి ఉమ్మడి ఆస్తిగా 62 ఎకరాల భూమిని చూపించారు.