ప్రముఖ యూట్యూబర్ బర్రెలక్కకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు తగిన భద్రత కల్పించాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె నియోజకవర్గంలో విస్తృతమైన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రముఖ యూట్యూబర్ బర్రెలక్కకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు తగిన భద్రత కల్పించాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె నియోజకవర్గంలో విస్తృతమైన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె తన సోదరుడితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె సోదరుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనను మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ సహా పలువురు ఖండించారు.
తనకు సరైన భద్రత కల్పించాలని హోంశాఖ కార్యదర్శులకు, ఎన్నికల సంఘం అధికారులకు, తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీచేయాలని బర్రెలక్క హైకోర్టులో పిటిషన్ వేశారు. బర్రెలక్క పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. బర్రెలక్కకు మద్దతుగా ఆమె తరఫు న్యాయవాదలు కోర్టులో వాదనలు వినిపించారు.
ఆమెపై జరిగిన దాడిపై కూడా వివరణ ఇస్తూ ఆధారాలు చూపించారు. బర్రెలక్క తరఫు లాయర్ల వాదనలు విన్న హైకోర్టు ఆమెకు తగిన సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించింది. ఆమె పబ్లిక్ మీటింగులకు కూడా ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీ భద్రత కల్పించాలని హైకోర్టు తెలిపింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆమె పూర్తి భద్రత ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీదే అని తెలిపింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలు, అభ్యర్తులకే కాకుండా సాధారణ అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాలని తీర్పు వెలువరించింది. ఎన్నికల బరిలో నిలిచిన వారికి ముప్పు ఉందని భావిస్తే వారికి కూడా భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. బర్రెలక్కతోపాటూ ఆమె కుటుంబ సభ్యులకు సెక్యూరిటీ కల్పించాలని ఎన్నికల సంఘాన్ని, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.