Telangana|అందుకే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం:

Mana Enadu: బీజేపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తానని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ హుజుర్‌నగర్(Huzurnagar) మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డితో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, జలగం వెంకట్రావు (Jalgam Venkatrao)బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరానని జలగం వెంకట్రావు అన్నారు. ఖమ్మం(Khammam) అభివృద్ధి చెందడం లేదని చెప్పారు.

ఖమ్మం అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలూ ఉన్నప్పటికీ డెవలప్ కావడం లేదని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ఖమ్మానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. అలాగే, మైనింగ్ కాలేజీని యూనివర్సిటీ చేయలేదని, భద్రాచలం(Bhadrachalam Temple) గుడిని అభివృద్ధి చేయలేదని అన్నారు. తమ జిల్లాకు రావాల్సిన నీళ్లు రావడం లేదని అన్నారు.

శ్రీనివాస్ గోమాస మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులను ప్రధాని మోదీ కాపాడుతున్నారని చెప్పుకొచ్చారు. పెద్దపల్లిలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా తాను వారి గెలుపుకోసం పని చేస్తానని చెప్పారు.

క్రమశిక్షణగల కార్యకర్తగా పనిచేస్తానని సైది రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తానని అన్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *