తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా గడ్డం ప్రసాద్​కుమార్​

మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ రెండవ స్పీకర్​గా వికారాబాద్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్​కుమార్​ కాంగ్రెస్​ అధిష్టానం నియమించడానికి నిర్ణయం తీసుకుంది. స్పీకర్​గా ఆయన పేరును మంత్రులు పేర్లుతోపాటు ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. సభ నిర్వాహణ కీలకంగా మారడంతో దళత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్​కుమార్​ స్పీకర్​గా అన్ని రకాలుగా అర్హుడిగా ఉంటాడని భావించింది.

వికారాబాద్​ జిల్లా మర్పల్లి గ్రామంలో 1964 సంవత్సరంలో గడ్డం ప్రసాద్​ జన్మించారు తాండూరు ప్రభుత్వ కాలేజీలో ఇంటర్​ పూర్తి చేశారు. 2008లో జరిగిన బై ఎలక్షన్స్​లో కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీఆర్​ఎస్​ పై విజయం సాధించారు. మళ్లీ 2009లో జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్​ఎస్​పై గెలిచారు. ఆతర్వాత వైఎస్​ క్యాబినెట్​చోటు దక్కించుకున్నారు. చేనేత, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014,2018లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్​ఎస్​ అభ్యర్థి మెతుకు ఆనంద్​పై ఓటమి చెందారు.

మూడుసార్లు ఎమ్మెల్యేతోపాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈనేపథ్యంలో అన్ని విధాలుగా అసెంబ్లీ స్పీకర్​గా సభను నడిపించడానికి అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్​ పెద్దలు భావించారు.తెలంగాణ రాష్ట్రంలో తొలి దళిత స్పీకర్​గా గడ్డం ప్రసాద్​కే అవకాశం పొందనున్నారు.

 

Share post:

Popular