Suhas: సుహాస్​ సినిమాతో నువ్వు నేను అనిత రీఎంట్రీ

Anita : యువ హీరో సుహాస్(Suhas) ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు సినిమాలతో హిట్స్ కొట్టి హ్యాట్రిక్ హీరో అయ్యాడు. కొత్త కొత్త కథలతో పాటు నటుడిగా కూడా ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. హీరోగా మరిన్ని సినిమాలు సుహాస్ చేతిలో ఉన్నాయి. త్వరలో ఏప్రిల్, మే రెండు నెలల్లో రెండు సినిమాలు సుహాస్ నుంచి రాబోతున్నాయి. తాజాగా సుహాస్ కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. టైటిల్ కూడా ప్రకటించారు.

సుహాస్ 8వ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama) అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ్ సూపర్ హిట్ సినిమా జోయ్ హీరోయిన్ మాళవిక మనోజ్ నటిస్తుంది. ఈ సినిమా కొత్త దర్శకుడు రామ్ గోడల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాతో ‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత(Anitha) హాసనందిని తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది.

నువ్వు నేను సినిమాతో తెలుగులో మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అనిత ఆ తర్వాత శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, రగడ.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. తెలుగులో సినిమాలు తగ్గించినా వేరే భాషల్లో అడపాదడపా సినిమాలు, టీవీ షోలు చేస్తుంది. చివరగా తెలుగులో 2016లో మనలో ఒకడు సినిమాలో నటించింది అనిత. ఇప్పుడు మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత సుహాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే నువ్వు నేను సినిమా రీ రిలీజ్ చేయడం గమనార్హం. మరి తెలుగులో రీ ఎంట్రీతో అనిత ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *