Mana Enadu: బీజేపీ కోసం బీఆర్ఎస్ నాయకులు అవయవదానం చేశారు. బీజేపీ గెలుపుకోసం బీఆర్ఎస్ నాయకులు ఎంతో కృషి చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Reventh Reddy)విమర్శించారు.
ఏడు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయింది. పార్టీ పెట్టినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటలో మెజారిటీ వచ్చింది. సిద్దిపేటలో హరీష్ రావు(HarishRao)కి పూర్తి పట్టున్నప్పటికీ తమ ఓట్లు బీజేపీకి వేయించారు. బీఆర్ఎస్ చేసిన కుట్రతోనే కాంగ్రెస్(Congress) ఎనిమిది చోట్ల ఓడిపోడిందని రేవంత్ అన్నారు.
మోదీ గ్యారంటీకిఉన్న వారంటీ అయిపోయింది. మోదీ.. కాలం చెల్లిపోయింది. మోదీ చరిష్మా తో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు తిరస్కరించిన మోదీ తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి విలువలు ఉంటే ప్రధాని పదవి నుండి హుందాగా తప్పుకోవాలని రేవంత్ అన్నారు.
ఈరోజు నుండి మరో రెండు గంటలు అదనంగా పని చేస్తాం. రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా, ఏ సీటు ఓడినా నాదే బాధ్యత. గెలుపు ఓటములు నేనే బాధ్యత తీసుకుంటా. మాకు వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాగా ఉన్నాయి. వాటిని స్వీకరిస్తున్నాను. కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నాడు. ఆత్మ ప్రబోధానుసారం బీఆర్ఎస్ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.
కేసీఆర్ రాజకీయ జాదుగాడు. కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటాడు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు కేసీఆర్, ఆయనతో బీజేపీ స్నేహం ఎలా చేస్తోందంటూ రేవంత్ ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాం. ఏపీతో ఉన్న ఆస్తులు, నీటి పంపకాలను చర్చించి పరిష్కరించుకుంటామని రేవంత్ పేర్కొన్నారు.