Mana Enadu: ఇక్కడ గెలిచిన వారు తర్వాత కాలంలో రాజకీయంగా ఉన్నత పదవులను సాధించారు.
2009లో జరిగిన ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ గెలిచారు. 2012-14 వరకు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2014లో తెలుగుదేశం తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన మల్లారెడ్డి .. అనంతరం పార్టీ మారి తెరాసలో చేరి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు.
2018లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పరాజయంపాలైన రేవంత్‌రెడ్డిని మల్కాజిగిరి ఆదుకుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. ఏకంగా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు.
ఇప్పుడు రాజేందర్ వంతు..
2023లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల రాజేందర్ ఓటమి చెందారు. తాజాగా మల్కాజిగిరి నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా విజయం సాధించారు. పాత ఆనవాయితీని కొనసాగిస్తూ ఈటల కూడా రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహిస్తారని ఆయన అనుచరులు, కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి గెలిచిన భాజపా ఎంపీల్లో కేంద్ర మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి… వారిలో ఈటల ఉంటారా లేదా మరేదైనా ఉన్నత పదవీ యోగం ఉందా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.