Sangareddy Accident:పేలిన రియాక్టర్.. ఆరుగురు కార్మికులు మృతి

సంగారెడ్డి జిల్లా చందాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎస్‌బీ కెమికల్‌ ఫ్యాక్టరీ(SB Chemical Factory)లో భారీ శబ్దంతో రియాక్టర్లు పేలాయి. పేలుడు ధాటికి కంపెనీలో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

దుర్ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు పని చేస్తుండగా.. మంటల్లో చిక్కుకున్న బాధితులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.

అయితే ఒక రియాక్టర్‌ నుంచి మరో రియాక్టర్‌కు (Reactor Fire Accident)మంటలు వ్యాపిస్తే ప్రమాదం మరింత త్రీవతరం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రుల్ని సిబ్బంది అత్యవసర చికిత్స కోసం సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related Posts

Bahraich : యూపీని వణికిస్తున్న తోడేళ్లు.. దాడులకు అదే కారణమా?

ManaEnadu:ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రాన్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహరయిచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల వల్ల క్షణక్షం భయంతో బతుకుతున్నారు. అయితే ఇలా తోడేళ్లు వరుస దాడులకు…

రేప్ చేస్తే లైఫ్‌టైమ్ జైల్లోనే.. ‘అపరాజిత బిల్లు’కు బంగాల్ అమోదం

ManaEnadu:పశ్చిమ బెంగాల్‌ (West Bengal) కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పెద్ద…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *