Lipstick: లిప్‌స్టిక్ హిస్టరీ.. క్రీస్తుపూర్వం 3600లోనే తయారు చేశారట!

Mana Enadu: లిప్‌స్టిక్(Lipstick) అంటే మనకు అందమైన పెదాలు మాత్రమే గుర్తొస్తాయి. దీన్ని కేవలం ఫ్యాషన్(Fashion) కోసమే వినియోగిస్తారని మనందరం అనుకుంటాం. కానీ ఈ చిన్న వస్తువుకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. లిప్‌స్టిక్ గురించి చెప్పుకోదగ్గ విశేషాలు ఇంకెన్నో ఉన్నాయి. లిప్‌స్టిక్ లేని మేకప్ కిట్ ఉండదు. కొందరు అమ్మాయిలైతే ఎక్కడికి వెళ్లినా బ్యాగ్‌(Hand Bags)లో లిప్‌స్టిక్ కూడా తమవెంట తీసుకెళ్తారు. అవేంటో ఒకసారి చూసేద్దాం.

ఎక్కడికి వెళ్లినా బ్యాగ్‌లోనే..

అయితే ఈ ఫ్యాషన్ టూల్ క్రీస్తు పూర్వం 3600 లోనే తయారు చేశారట. మెసొపొటేమియా(Mesopotamia) కాలం నుంచే దీన్ని వినియోగిస్తున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. లిప్‌స్టిక్ వినియోగం క్రీస్తు పూర్వం 2000 ప్రాంతంలో ఈజిప్టు(Egypt)కు చేరుకుంది. అప్పుడు రత్నాలను నూరి పొడిగా చేసి దాన్ని పెదాలను అలంకరించడానికి ఉపయోగించేవారు. ఆ కాలంలో మహిళలతో పాటు పురుషులు కూడా లిప్‌స్టిక్‌ను విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారు. మహిళలు కేవలం ఎరుపు రంగు లిప్‌స్టిక్ వాడితే.. పురుషులు వివిధ రంగులు ట్రై చేసేవారు.

 అప్పట్లో వారు మాత్రమే వాడాలని..

కొన్ని మూఢనమ్మకాల కారణంగా లిప్‌స్టిక్‌ను కృత్రిమ రంగుగా భావించి పలు ప్రాంతాల్లో దీని వినియోగాన్ని తీవ్రంగా ఖండించారు. వీటిని ఉపయోగించేవాళ్లను మంత్రగాళ్లు, మంత్రగత్తెలుగా చిత్రీకరించి అవమానించారు. కేవలం వేశ్యలు మాత్రమే లిప్‌స్టిక్ ధరించాలని నిబంధనలు కూడా పెట్టారు. ఆత్మగౌరవం ఉన్న ఏ మహిళా లిప్‌స్టిక్ పెట్టుకోకూడదని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం కూడా జరిగిందట. మతపరమైన కారణాలు కూడా లిప్‌స్టిక్‌ వాడకాన్ని చాలా ప్రభావితం చేశాయి. లిప్‌స్టిక్ వాడితే దేవుడు ఇచ్చిన మానవ రూపాన్ని అవమానించినట్లే అని భావించారట. వీటి తయారీలో గొర్రెల చెమట వంటివి వాడటం, దీని వల్ల మహిళలు అనారోగ్యానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 1920 నాటికి లిప్‌స్టిక్‌పై ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో లిప్‌స్టిక్‌ని వినియోగించడం ప్రారంభించారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దీనిపై నిషేధం కొనసాగుతూనే ఉంది. పెదవులపై లిప్‌స్టిక్ నిగనిగా మెరవడానికి ఇప్పటికీ వాటిల్లో చేపల పొలుసులను వాడుతున్నారు. వీటి తయారీలో ఆవులు, గొర్రెలు, పందులు, తిమింగలాల నుంచి వచ్చే పదార్థాలనూ వినియోగిస్తున్నారు. ఇలాంటివేవీ లేని లిప్‌స్టిక్‌లు మార్కెట్‌లో కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.

Share post:

లేటెస్ట్