Slim Diet: ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే సరి!

Mana Enadu: ప్రస్తుత కాలంలో దాదాపు 80శాతం మందిని వేధిస్తోన్న సమస్య అధిక బరువు, ఊబకాయం. ఒకప్పుడు ఎంత తిన్నా ఈ సమస్య ఉండేది కాదు. కానీ ప్రస్తుతం తిన్నా తినకపోయినా బరువు పెరిగిపోతున్నాం. ప్రస్తుత బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా సమయానికి చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం. సరైన ఆరోగ్యం(Health) లేకపోతే ఎన్ని ఉన్నా అవన్నీ వేస్టే. అందుకే అధిక బరువు ఉన్నవారు స్లిమ్‌గా మారేందుకు జిమ్‌లు, వ్యాయామాలు అంటూ పరిగెడుతున్నాం. అయితే బరువు పెరగడమనేది వయస్సు, అనారోగ్యం, ఆహారం, హార్మోన్లు, శారీరక శ్రమ స్థాయి వంటి వివిధ జీవనశైలి కారకాల కారణంగా తరచుగా మారుతూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్(Diabetis), అధిక రక్తపోటు క్యాన్సర్లు వంటి రావడానికి అధిక బరువే ప్రధాన కారణంగా చెబుతారు. చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల ఊబకాయం బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు కొన్ని స్పీడ్ స్లిమ్ డైట్ గురించి వివరిస్తున్నారు. ఇంతకీ ఏంటీ ఈ డైట్.. మనమూ ఫాలో అయిపోతే పోలా..

Speed slim diet

రోజూ ఈ ఆహారంపై ఫోకస్ చేయండి..

☞ ముందుగా స్పీడ్ స్లిమ్ డైట్‌లో పోషకాలు ఉండే ఆహారాలపైనే దృష్టి పెట్టాలి. ఓట్స్, బార్లీ, కూరగాయలు వంటి ఫైబర్ ఉన్న ఆహారాలను తినేందుకు ప్రయత్నించండి. ఇవి కొంచెం తింటే చాలు పొట్ట నిండినట్టుగా అవుతుంది. కాబట్టి ఆ రోజంతా మీరు తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.

☞ ఫైబర్(Fiber) బరువు తగ్గించే విషయంలో హీరో అనే చెప్పాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎంతగా తింటే మీరు అంత త్వరగా బరువు తగ్గుతారు. ఇది తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

☞ బరువు(Weight) తగ్గడానికి ఎక్కువ మంది చేసే పని తక్కువ ఆహారాన్ని తింటారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తోంది. మీరు ఎంత తింటున్నారు అనేది ముఖ్యం కాదు, ఏం తింటున్నారు అనేదే ముఖ్యం. పోషకాల నిండిన ఆహారం తినడమే ముఖ్యం. రోజుకు రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లు బ్రేక్ ఫాస్ట్ లో తినండి చాలు. అవి ఎంతో శక్తినిస్తాయి. ఆ రెండు కోడిగుడ్లు మధ్యాహ్నం వరకు మీకు ఆకలి వేయకుండా అడ్డుకుంటాయి.

☞ మీ ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, జింక్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలతో నిండిన ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. తీపి పదార్థాలకు, Fry Foodకి పూర్తిగా దూరంగా ఉండండి. కూల్ డ్రింకులు(Cooldrinks), సోడాలు, ధూమపానం, మద్యపానం మానేయండి. ఇవన్నీ మిమ్మల్ని బరువు పెరిగేలా చేస్తాయి.

☞ ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన కోడిగుడ్లతో రోజును మొదలు పెట్టండి. రెండు కోడిగుడ్ల(Eggs) గురించి తినకపోవడం మంచిది. ఇది ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే శక్తిని అందిస్తుంది. కోడిగుడ్లను తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం వరకు ఏమీ తినకుండా అలానే ఉండండి.

☞ మధ్యాహ్నం భోజనంలో ఒక కప్పు రైస్(Rice), ఒక కప్పు కూరగాయలతో వండిన కూర, ఒక కప్పు పెరుగుతో ముగించండి. రాత్రి పూట వీలైతే ఒక చపాతీ తినండి. సాయంత్రం మాత్రం గుప్పెడు నట్స్(Nuts) తినేందుకు ప్రయత్నించండి.

☞ దీంతోపాటు రోజూ ఒక గంట పాటు వాకింగ్(Walking) లేదా రన్నింగ్ చేయడం అలవాటుగా మార్చుకోండి. నెల రోజుల్లోనే మీలో మంచి మార్పు కనిపిస్తుంది. నెల రోజుల్లో కనీసం మూడు నుంచి నాలుగు కిలోలు సులువుగా తగ్గుతారు.ఇంకెందుకు ఆలస్యం ట్రై చేస్తే పోలా..

Share post:

లేటెస్ట్