హబ్సిగూడ విద్యుత్తుశాఖ సర్కిల్ కార్యాలయంలో లంచం డిమాండ్ చేసిన జూనియర్ అకౌంట్స్ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన చోటు చేసుకుంది.
నాచారం ఏడీఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిజెన్ భరత్‌కు సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని జూనియర్ అకౌంట్స్ అధికారి విజయ్ సింహరెడ్డిని ఆర్టిజెన్ భరత్ కొద్దిరోజులగా వేడుకుంటున్నాడు. ముడుపులు చెల్లిస్తే కానీ చెల్లించేది లేదన్నాడు.
సక్రమంగా పనిచేసిన వేతనాలు విడదల చేసేందుకు రూ.35వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో హైదరాబాద్–2 ఏసీబీ యూనిట్ అధికారులను ఆశ్రయించాడు. ఈక్రమంలోనే శుక్రవారం నిఘా లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
నిందితుడుపై ఏసీబీ(ACB HYDERABAD) అధికారులు కేసు నమోదు చేసి నాంపల్లి కోర్డుకు తరలించి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు.