కోల్​కతా డాక్టర్​ హత్యాచారం కేసు.. ఘటనకు ముందు రోజు ఆస్పత్రిలోనే నిందితుడు

ManaEnadu:దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్​ కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో తవ్వినకొద్ది సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హత్యాచారం ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ బాధితురాలిని గమనించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించినట్లు అధికారులు తెలిపారు. అయితే డాక్టర్​పై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్​ఏ రిపోర్టు ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఆమెపై గ్యాంగ్ రేప్ జరగలేదని.. డీఎన్​ఏ రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

నిందితుడు సంజయ్‌ రాయ్‌ ఘటనకు ముందు రోజు అంటే ఆగస్టు 8వ తేదీన ఆస్పత్రిలో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది. ఇదే విషయాన్ని విచారణలో నిందితుడిని ప్రశ్నించగా నిజమేనని ఒప్పుకున్నట్లు తెలిసింది. నేరానికి ముందు రోజు నిందితుడు సంజయ్ రాయ్ ఆర్​జీ కార్ ఆస్పత్రికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

ఆగస్టు 8వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లాడని వెల్లడించారు. ఆ సమయంలో చెస్ట్ మెడిసన్ వార్డ్​లో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని చెప్పారు. ఆ సమయంలో అదే వార్డులో బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వారిని నిందితుడు గమనిస్తున్నట్లు ఫుటేజీలో కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఫుటేజీలో ఉన్న నలుగురు జూనియర్ డాక్టర్ల స్టేట్​మెంట్ కూడా రికార్డు చేసుకున్నట్లు వెల్లడించారు.

ఘటన జరిగిన రోజు ఆగస్టు 9న తెల్లవారుజామున ఒంటిగంటకు బాధితురాలు ఆస్పత్రిలోని సెమినార్‌ హాల్‌లోకి వెళ్లి అక్కడ మరో జూనియర్‌ డాక్టర్‌తో కాసేపు మాట్లాడి నిద్రపోయేందుకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు రాయ్‌ 4 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఆ సమయంలోనే నేరం జరిగి ఉండొచ్చని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందుతుడిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని అధికారులు వెల్లడించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *