Mana Enadu: ఏపీలో కూటమి సర్కార్‌పై మాజీ సీఎం, వైసీపీ(Ycp) అధినే జగన్(Jagan) నిప్పులు చెరిగారు. చంద్రబాబు(Chandrababu naidu) ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టకుండా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడంపై ఫోకస్ పెట్టిందని జగన్ ఫైరయ్యారు. సీఎం చంద్రబాబు దాడులతో ప్రజలు భయపడుతున్నారన్నారు. ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. మేనిఫెస్టో(manifesto)లో ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు విస్మరించారని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీని ఎగ్గొట్టేశాడు అని మండిపడ్డారు.
చంద్రబాబు సాధించేది ఏమైనా ఉందా..
ఎన్టీఆర్ నవాబ్‌పేట(nawab peta)లో తమ కార్యకర్తలపై దాడి ఘటనను జగన్ ఖండించారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వాన్ని మళ్లీ హెచ్చరిస్తున్నా.. దాడులు ఆపండి.. అని స్పష్టం చేశారు. నవాబ్‌పేటలో వైసీపీ కార్యకర్తలపై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందని, దాదాపు 20 మంది వచ్చి దాడకి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఇలాంటి దాడులు చంద్రబాబు సాధించేది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
అవసరమైతే సుప్రీంకోర్టు వెళతాం..
‘గ్రామస్థాయి నుంచే బీభత్సం సృష్టిస్తున్నారు. నంద్యాలలోనూ రాజకీయ హత్య జరిగింది. శుక్రవారం అక్కడికి వెళుతున్నా.. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. రేపు మేం గద్దెనెక్కుతాం. ఈ పరిస్థితి ఇంతటితో ఆగకపోతే అప్పుడు మా వాళ్లు ఆగమన్నా ఆగే పరిస్థితి ఉండదు’ అంటూ జగన్ వార్నింగ్(warning) ఇచ్చారు. కాగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను ఇటీవల రాజకీయ పక్షాలకు వివరించామని, జాతీయస్థాయి నేతల దృష్టికి కూడా తీసుకెళ్లామని జగన్ తెలిపారు. ఇప్పుడు జరిగిన దాడులను గవర్నర్‌కు వివరిస్తామని, అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు అయినా వెళతామని జగన్ స్పష్టం చేశారు.