Telangana|రైతులకు గుడ్​ న్యూస్​..మార్చిలోనే రుణమాఫీ..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. అధికారంలోకి రాగానే తొలిప్రాధాన్యత అన్నదాతలకే అంటూ తెలిపింది. ఈక్రమంలోనే రైతు రుణమాఫీ హామీ అమలు చేసే దిశగా గవర్నమెంట్​ చర్యలు ప్రారంభించింది.
రూ.2 లక్షల వరకూ ఉన్న రైతు బ్యాంకు రుణాలను ప్రభుత్వం తన ఖాతాకు బదిలీ చేయబోతుంది. ఇప్పటికే రిజర్వు బ్యాంకు, బ్యాంకర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. మార్చి నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ కొలిక్కి రానుంది

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట రుణాలను మాఫీ(Rythu Runa Mafi) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ.2 లక్షలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోను విడుదల చేసి కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఇటీవల బడ్జెట్​ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని పొందుపరిచారు. ఇచ్చిన హామీ మేరకు రైతులను రుణ విముక్తులను చేస్తామని పేర్కొంది. రుణమాఫీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలోని బ్యాంకర్లతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించి రైతుల రుణాల మాఫీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. రెండు లక్షల రూపాయల్లోపు రైతుల అప్పుల మొత్తం రూ.35 వేల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. అంత భారీ మొత్తం ఒకేమారు చెల్లించే అవకాశం లేదు. దీంతో ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సర్కార్​కు వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని దానికి కొంత మేర జమయ్యేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేసింది

కొడంగల్ జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అంశాన్ని తీసుకొచ్చారు.సీఎం ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ చేసి రైతులను విముక్తులను చేస్తామని ప్రకటించారు.లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ ముందే ప్రకటన : రుణమాఫీ అంశానికి సంబంధించి ఆర్బీఐ, బ్యాంకర్లతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తోంది. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule)​ ప్రకటనకు ముందు అమలు కార్యాచరణ ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు వచ్చే నెల మొదటివారంలో ఓ కొలిక్కి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరిన వారం రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. వారం రోజుల్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500లకే గ్యాస్​ సిలిండర్​ పథకాలను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. మార్చి 15న రైతుబంధు, రైతుభరోసా డబ్బులను ఇవ్వనున్నట్లు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *