US ELECTIONS 2024 : నో ఆడియెన్స్.. ఆ సమయంలో మైక్​ మ్యూట్.. ట్రంప్​-హారిస్ డిబేట్​ రూల్స్ ఇవే!

ManaEnadu:మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) జరగనున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ప్రచారం హోరెత్తుతోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తలపడుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ అగ్రరాజ్య రాజకీయాన్ని రసవత్తరం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ హ్యారిస్​పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రచారంలో మరింత వేడి పుట్టిస్తున్నారు. ఇక కమలా హ్యారిస్ తనదైన శైలిలో ట్రంప్ విమర్శలను తిప్పి కొడుతున్నారు.

డిబేట్ రూల్స్ ఇవే..

అయితే డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్(Kamala Harris) సెప్టెంబర్​లో డిబేట్​లో పాల్గొననున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 10వ తేదీన ఫిలడెల్పియాలో ఈ డిబేట్ జరగనుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రంప్.. ఈ భేటీకి సంబంధించిన నిర్దిష్ట షరతులు, నియమాలను వివరించారు. జూన్‌ 27వ తేదీన సీఎన్‌ఎన్‌లో అధ్యక్షుడు జోబైడెన్‌తో జరిగిన చర్చలో పాటించిన నియమాలను ఈ డిబేట్ (Donald Trump Kamala Harris Debate)​లోనూ ఫాలో అయ్యేందుకు తాను, కమలా హారిస్‌ ఒప్పందానికి వచ్చినట్లు తెలిపారు. ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని వెల్లడించారు. ముఖ్యంగా అభ్యర్థులు మాట్లాడనప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్‌ చేసి ఉంటాయని స్పష్టం చేశారు.

“కామ్రేడ్‌ కమలాహారిస్‌తో చర్చకోసం రాడికల్‌ లెఫ్ట్‌ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాను. ఏబీసీ ఫేక్‌న్యూస్‌లో అది ప్రసారమవుతుంది. అది అత్యంత అన్యాయమైన వార్తా సంస్థ.” అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టులోనే కమలా హ్యారిస్​తో డిబేట్​కు సంబంధించిన వివరాలు షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరి డిబేట్ ఆసక్తికరంగా ఉండబోతోందని.. దీని కోసం కేవలం అమెరికా (American Elections 2024) మాత్రమే గాక.. ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Share post:

లేటెస్ట్