ManaEnadu:భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోదీ విదేశీ పర్యటనల్లో పలుమార్లు ఈ విషయం రుజువైంది. అయితే తాజాగా మోదీకి విదేశాల్లో ఉన్న పాపులారిటీ ఏంటో తెలిపే సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీన అమెరికాలో ‘మోదీ&యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ (Modi & US Program Together)’ కార్యక్రమం జరగనుంది.
సీటింగ్ కెపాసిటీ 15వేలు.. రిజిస్ట్రేషన్లు 24వేలు
నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో జరగనున్న ఈ ఈవెంట్ (PM Modi Event in US)కు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే 24 వేల మంది ప్రవాస భారతీయులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఈవెంట్ నిర్వహించనున్న వేదిక సామర్థ్యం 15వేలు మాత్రమేనని.. 8వేల మంది అధికంగా రిజిస్ట్రేషన్ (Modi US Event) చేయించుకున్నారని ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ(IACU) వెల్లడించింది. అదనంగా వస్తున్న వారి కోసం ప్రత్యేకంగా మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపింది. ఈ కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు (NRIs at Modi Event) హాజరవుతారని పేర్కొంది.
అంచనాను మించి రిజిస్ట్రేషన్లు..
ఈ కార్యక్రమం భారత-అమెరికన్ కమ్యూనిటీకి ఎంతో ముఖ్యమైనదని.. విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మోదీ ప్రసంగంతో పాటు భారతీయ, అమెరికన్ (Indo American Bond) సంప్రదాయాలు చాటేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. కానీ ప్రధాని ప్రసంగం కోసం ఎన్ఆర్ఐలు చాలా ఆసక్తిగా, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అనుకున్నదానికంటే ఎక్కువ మంది ఈవెంట్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. వారందరికీ సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
మూడోసారి ప్రధానిగా మోదీ పర్యటన
ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా 2014లో మోదీ (PM Modi US Visit) న్యూయార్క్‌లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి వెళ్లారు. ఆ తర్వాత 2019లో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని NRG స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇక ఇప్పుడు మూడోసారి ఆయన అమెరికాలో ప్రసంగించనున్నారు. మరోవైపు ఐరాస జారీ చేసిన తాత్కాలిక స్పీకర్ల జాబితా ప్రకారం సెప్టెంబర్ 26న ఇక్కడ జరిగే అత్యున్నత స్థాయి యూఎన్(UN) జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించం ఉండనుంది.