ట్రంప్ Vs హారిస్ డిబేట్.. పైచేయి కమలదేనట!

ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections 2024) ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ల ప్రచారం హోరెత్తుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో అగ్రరాజ్య రాజకీయం రంజుగా మారుతోంది. ఈ ఎలక్షన్ హీట్​ను మరింత పెంచేసింది సెప్టెంబరు 10వ తేదీన ట్రంప్, హారిస్​ల మధ్య జరిగిన డిబేట్.

డిబేట్​లో పైచేయి ఎవరిది?

ఈ డిబేట్​ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనించింది. గతంలో డెమోక్రాట్ అభ్యర్థిగా నిలిచిన ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ (Joe Biden)​- ట్రంప్ మధ్య జరిగిన డిబేట్​లో ట్రంప్ పైచేయి సాధించినట్లు అమెరికన్ మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజా సంవాదంలో మాత్రం కమలా హారిస్ (Kamala Harris)​ టాప్​లో నిలిచారు. ట్రంప్​కు గట్టి పోటీనిస్తూ అస్సలు తొణకకుండా దీటుగా సమాధానమిస్తూ ట్రంప్​ను బలంగా ఎదుర్కొన్నారు హారిస్. అయితే ఈ డిబేట్​పై అమెరికాలోని పలు మీడియా సంస్థలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మరి ఎవరెవరు ఏమన్నారంటే?

ఏబీసీ మీడియా: ఈ డిబేట్​ను నిర్వహించిన ఏబీసీ మీడియా ఈ సంవాదంలో కమలా హారిస్‌పై పేచేయి సాధించేందుకు ట్రంప్‌(Donald Trump)​ అసంబద్ధ వాదనలు చేసినట్లు పేర్కొంది. ట్రంప్ విమర్శలకు హారిస్ దీటుగా స్పందించడమే కాకుండా అతడికి టైం ఇవ్వకుండా విరుచుకుపడినట్లు తెలిపింది.

ది న్యూయార్క్‌ టైమ్స్‌: ట్రంప్‌ను ఇరకాటంలో పడేసేందుకు కమలా హారిస్‌ (Trump Harris Debate) ప్రాసిక్యూటర్‌గా తనకున్న అనుభవాన్ని ఉపయోగించుకున్నారని పేర్కొంది న్యూయార్క్‌ టైమ్స్‌. అయితే హారిస్‌పై ఆధిపత్యం సాధించే బదులు ట్రంప్ తన టైం అంతా తనను తాను సమర్థించుకునేందుకు ఉపయోగించారని చెప్పింది.

వాషింగ్టన్‌ పోస్ట్‌: ట్రంప్‌ వాదనలు వాస్తవాలకు దగ్గరగా లేవని పేర్కొంది.

పొలిటికో: ఈ డిబేట్‌లో కమలా హారిస్‌దే విజయమని పొలిటికో పేర్కొంది. భారీ విజయంగా అభివర్ణించింది.

ఫాక్స్‌ న్యూస్‌: Fox News మాత్రం డిబేట్‌లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారని పేర్కొంది.

సీఎన్‌ఎన్‌: కమలా హారిస్‌ పూర్తి సన్నద్ధతతో వచ్చారని పేర్కొంది CNN. ఆమె ప్రతి సమాధానం ట్రంప్​నకు కోపం తెప్పించేలా ఉందని చెప్పింది. ఈ క్రమంలో ట్రంప్‌ ఒక్కోసారి సహనం కోల్పోయినట్లు కనిపించారని తెలిపింది.

Related Posts

US సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా 13 ఏళ్ల బాలుడు.. ఎందుకంటే?

అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఏం చేసినా సంచలనమే. ఆయన చేసే వ్యాఖ్యలే కాదు.. తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయ్ మరి. తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుని దేశం మొత్తం ఆయన వైపు…

Prabowo: భారత్‌కు ఇండోనేషియా అధ్యక్షుడు.. మహాత్మా గాంధీకి నివాళి

ఈసారి గణతంత్ర వేడుకలకు(Republic Day Celebrations) ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Indonesian President Prabowo Subianto) హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌(Kartavyapath)లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఇండోనేషియాకు చెందిన 160 మంది సైనికుల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *