Fake Medicines: ఆరోగ్యం ముఖ్యం బిగులూ.. ఫేక్ మెడిసిన్ గుర్తించండిలా!

Mana Enadu: ప్రస్తుతం అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇందులో కొన్ని అంటువ్యాధులు కాగా మరికొన్ని దోమలు, ఈగలు, అపరిశుభ్రత కారణంగా వస్తుంటాయి. మరికొందరికి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీంతో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జనం ముందుగా ఆసుపత్రికి వెళ్లకుండా మెడికల్ షాపుల వద్దకు పరుగులు తీస్తుంటారు. వారికి పలానా సమస్య ఉందని చెప్పి వారు ఇచ్చిన మందులు తెచ్చి రోజుల కొద్దీ వాడుతుంటారు. అయితే ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యం బాగుపడటమే కాకా మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పైగా ప్రస్తుతం మార్కెట్లో వందల సంఖ్యలో మందుల షాపులు వెలుస్తున్నాయి. ఇందులో చాలా దుకాణాల్లో నకిలీ మందులు విక్రయిస్తున్నారని గతంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మనిస్ట్రేషన్(DCA) అధికారులు తెలిపారు. చాక్ పౌడర్, గంజితో మందులు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే నకిలీ మందులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం…

వీటి ద్వారా నకిలీవిగా నిర్ధారించుకోండి

☛ ఆన్‌లైన్‌లో లేదా మెడికల్ స్టోర్ నుంచి మందులను కొనుగోలు చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మీరు ఔషధం కొనడానికి వెళ్లినప్పుడల్లా దానిపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను తనిఖీ చేయాలి. ఔషధంపై క్యూఆర్ కోడ్ లేకపోతే అది నకిలీ కావచ్చు. QR కోడ్ అనేది ఒక ప్రత్యేకమైన కోడ్. ఇది ఔషధానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒకే స్కాన్‌లో అందిస్తుంది.
☛ పక్కపక్కన పోలిక: మీరు ఇంతకు ముందు నిర్దిష్ట ఉత్పత్తిని ఉపయోగించినట్లయితే, అనుమానాస్పద ఉత్పత్తిని అదే కంపెనీకి చెందిన అసలైన దానితో సరిపోల్చండి. పరిమాణం, బరువు, రంగు, నాణ్యత లేదా ఎంబాసింగ్‌లో ఏవైనా వైవిధ్యాలను గమనించండి, ఎందుకంటే ఇవి నకిలీని సూచిస్తాయి. భవిష్యత్ పోలికల ఓ ఫొటో తీసుకోవడం మేలు.
☛ మందులపై ఉంటే స్పెల్లింగ్ తప్పులు, వ్యాకరణ దోషాల కోసం మెడిసిన్ లేబుల్‌లను జాగ్రత్తగా పరిశీలించండి.
☛ మెడిసిన్ తయారీ తేదీ, ఎక్స్పైరీ గడువును ధృవీకరించండి. బయటి అట్టపెట్టెలోని వివరాలు స్ట్రిప్, బ్లిస్టర్ లేదా బాటిల్ లోపలి లేబుల్‌తో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి.
☛ మందుల రూపం, కలర్, ప్యాకేజింగ్‌లో వైవిధ్యాల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఇది నకిలీ ఉత్పత్తులను గుర్తించడంలో దోహదపడుతుంది.
☛ ధర గణనీయంగా తక్కువగా ఉంటే లేదా సాధారణ మార్కెట్ రేటుతో పోలిస్తే ఉత్పత్తి గణనీయమైన తగ్గింపుతో విక్రయిస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
☛ ట్యాంపరింగ్ సంకేతాల కోసం ప్యాకేజింగ్‌ను తనిఖీ చేయండి. సీల్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయని, ప్యాకేజీ తెరవబడినట్లు ఎటువంటి సూచనలు లేవని నిర్ధారించుకోండి.
☛ మీరు కొనుగోలు చేసిన మెడిసిన్ వాడిన తర్వాత ఏమైనా దుష్ప్రభావాలు, అలెర్జీ వంటివి వస్తే గమనించండి.
☛ మెడికల్ షాప్ నుంచి మందులను కొనుగోలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ బిల్లును తీసుకోవడం మర్చిపోవద్దు. “నో బిల్, నో పిల్” అనే నినాదాన్ని పాటించడం మేలు.
☛ నియంత్రణ లేని వెబ్‌సైట్‌లు లేదా అనధికారిక ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మందులను కొనుగోలు చెయొద్దు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన లైసెన్స్‌లను ప్రముఖంగా ప్రదర్శించే లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచి మాత్రమే మెడిసిన్ కొనుగోలు చేయండి.

 నకిలీ మందులను గుర్తిస్తే ఫిర్యాదు చేయండిలా..

☛ స్థానిక డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
☛ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ వెబ్‌సైట్‌లోనూ కంప్లైంట్ ఇవ్వొచ్చు.
☛ స్థానిక డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ సంప్రదించొచ్చు.
☛ DCA టోల్-ఫ్రీ నంబర్‌ 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

Related Posts

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

Sonia Gandhi: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ఏమైందంటే!

కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *