Gastric:గ్యాస్ట్రిక్ సమస్య వేధిస్తోందా.. ఈ అలవాట్లు మార్చుకుంటే సరి!

ManaEnadu:ప్రస్తుతం చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలి, నిద్రలేమి, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌, పీహెచ్‌ హై లోడింగ్‌, ఒత్తిడి వంటి రకరకాల కారణాలతో కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీనివల్లకడుపులో నొప్పి, ఛాతీలో మంట, తేన్పులు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరి ఆస్పత్రికి వెళ్లకుండానే గ్యాస్ట్రిక్​ సమస్య నుంచి రిలీఫ్​ పొందాలంటే ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మార్పులేంటంటే?

తినకూడనవి ఇవే..

ఎక్కువ మొత్తంలో ఒకేసారి తినడం కంటే రోజుకు 5 నుంచి 6 సార్లు తక్కువ తక్కువ ఆహారం తీసుకోవాలి

మసాలాలు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి

ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకూడదు

టమాటాలు, నిమ్మకాయలు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటివి తాగొద్దు

కొంతమందిలో డైరీ ఉత్పత్తులు ఎసిడిటీ పెంచుతాయి. అలాంటి వారు పాల ఉత్పత్తులు తగ్గించాలి

ఒత్తిడికి గురి కాకుండా యోగా, ధ్యానం వంటివి చేయాలి

ఇక కూరగాయల్లో కాలీఫ్లవర్, క్యాబేజీ, పచ్చి కీరా, ఉల్లి, కార్న్ ఫ్లేక్స్ వంటివి తినొద్దు.

మరి ఏం తినాలంటే..

కొన్ని రకాల పండ్లు, కూరగాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

అలా అని ఒకేసారి అధిక ఫైబర్ తీసుకోకూడదు.

గమనిక : మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Share post:

లేటెస్ట్