ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains in Telugu States) కురుస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అయితే అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లడం తప్పనిసరి. అలా ఈ వర్షంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లినా కాస్తో కూస్తో తడిచిపోవడం ఖాయం. ఇక ఇంట్లో ఉన్నా కూడా వర్షాకాలంలో వాతావరణం అంతా చల్లగా ఉండటంతో జలుబు, తుమ్ములు, జ్వరం, గొంతు నొప్పి (Throat Pain) వంటి సమస్యలు దరి చేరతాయి. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ఇవి తీవ్రరూపం దాల్చకుండా.. డాక్టరు వద్దకు వెళ్లుకండా సేఫ్ గా ఉండొచ్చని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలు (Health Tips) ఏంటంటే..?
గోరువెచ్చని నీళ్లలో ఉప్పు : వానా కాలం (Monsoon)లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి గొంతు నొప్పి. మీరు ఈ నొప్పితే బాధపడితే అప్పుడు గోరువెచ్చని నీళ్లలో కాస్త ఉప్పు వేసుకుని ఆ నీటితో పుకిలిస్తే.. గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
గోరువెచ్చని పాలు: జలుబు (Cold), తుమ్ములు వంటి సమస్యలతో సతమతమవుతుంటే.. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగాలి.
ఆవిరి పట్టడం : చాలా మందికి వానలో తడవగానే తుమ్ములు షురూ అవుతాయి. ఆ తర్వాత జలుబు, దగ్గు, జ్వరం (Viral Fevers) వెంటవెంటనే వస్తాయి. మరి తుమ్ముల వద్దే చెక్ పెట్టాలంటే.. గోరువెచ్చని నీటిలో కాస్త పసుపు వేసుకుని ఆవిరి పట్టాలి. దీనివల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది.
తులసి ఆకులు, నల్ల మిరియాల పొడి : కప్పు నీళ్లలో కొన్ని తులసి ఆకులు, నల్ల మిరియాల పొడి వేసుకుని బాగా మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగాళి. దీని వల్ల జలుబు, తుమ్ములు తగ్గిపోతాయి.
2010లో చైనా జర్నల్ ఆఫ్ నర్సింగ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఆవిరి పట్టడం వల్ల జలుబు, తుమ్ములు వంటివి తగ్గుతాయని తేలింది.
గమనిక : మీకు అందించిన ఆరోగ్య సూచనలు మీ అవగాహన కోసం మాత్రమే. పరిశోధనలు, అధ్యయనాల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే ఉత్తమం.