ManaEnadu:ప్రస్తుత జీవనశైలితో చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మందికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటోంది. జీవనశైలిలో మార్పుల వల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమ డైట్ లో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం (Healthy Lifestyle)వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ డైట్ లో మిల్లెట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇలాంటి వారి కోసం ఆరోగ్యం, ప్రజల శ్రేయస్సు ప్రోత్సహించేలా.. ప్రజలను ఆరోగ్య జీవనం వైపు వెళ్లేలా Taaza సరికొత్త ఉత్పత్తులతో ముందుకు వచ్చింది. తాజాగా తాజా సంస్థ హైదరాబాద్ మార్కెట్‌లో మిల్లెట్, సాధారణ పిండి ఉత్పత్తులను విడుదల చేసింది. చర్లపల్లి ఐడీఏ ఫేజ్ -2లో ఈరోజు గ్రాండ్ గా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మిల్లెట్ పరిశ్రమలో ప్రతిష్టాత్మక వ్యక్తులు, పలువురు నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ స్టార్టప్ ను విట్టల్ (Taaza Startup) నడుపుతుండగా.. హైదరాబాద్ ప్రజలకు పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా మార్కెట్ ప్రవేశించినట్లు విట్టల్, అండ్ గ్రూప్ శ్రీనివాస్, రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. మిల్లెట్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను వివరించారు.
(ఇడ్లీ & దోస) 5 రకాల కోడో, లిటిల్, ఫాక్స్‌టైల్, ఫింగర్ మిల్లెట్స్ రెగ్యులర్‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుభాత్ర, రామసుబ్బారెడ్డి, చంద్రశేకారెడ్డి సహా మిల్లెట్ స్పేస్‌లోని ప్రముఖ వ్యక్తులు, సామాజిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ ప్రయోగం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువ మందికి అందుబాటులో ఉంచడంలో ఒక ముఖ్యమైన అడుగు అని మిల్లెట్ విప్లవం(Millet Revolution)లో ప్రముఖ వ్యక్తి సుభాత్ర అన్నారు. తాజా ప్రయత్నాలను ప్రశంసిస్తూ మిల్లెట్ పిండిలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ద్వారా, తాజా మంచి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మన పర్యావరణానికి కీలకమైన మిల్లెట్ల స్థిరమైన వ్యవసాయానికి కూడా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. మిల్లెట్‌లను ప్రోత్సహిస్తూ తాజా రైతులకు మద్దతు ఇస్తోందని రామసుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.







