Bananas: పడుకునే ముందు అరటిపండు తింటున్నారా?

Mana Enadu: తాజా పండ్లు(Fresh Fruits) ఆరోగ్యానికి చాలా మంచివి. పైగా ఆరోగ్య నిపుణులు(Health Advisors) కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినాలని సూచిస్తూ ఉంటారు. పండ్లలో ఉండే విటమిన్లు(Vitamins), మినరల్స్, ఫైబర్(Fibers) శరీరానికి చాలా అవసరం. అయితే కొన్ని పండ్లను ఖాళీ కడుపుతో తింటే మంచిది. మరికొన్ని తిన్న తర్వాత తింటే మేలు చేస్తాయి. అయితే అందరికీ అందుబాటులో ఉండేవి, తక్కువ ధరలో దొరికే పండ్లు.. అరటి పండ్లు(Banana’s). అంతేకాదండోయ్ తెలుగు ప్రజలు ఎక్కవగా ఇష్టపడి తినే ఫ్రూట్ కూడా ఇదే. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం బాగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే..

అయితే అరటిపండ్లలో ఉండే పోషకాలు ఎక్కువ. ఆ పండును తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ రాత్రి పూట కొంతమంది తింటూ ఉంటారు. అలా తినడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతారు. ఇది నిద్రా నాణ్యతను పెంచుతుందని అంటారు. వాస్తవానికి మీ నిద్రకు అరటి పండు ఏవిధంగానూ సహకరించదు. ఇటీవల చేసిన ఓ తాజా అధ్యయనం(Research) ఈ విషయాన్ని తేల్చింది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6 నిండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శాంతపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక అరటి పండు మన శరీరానికి కావాల్సిన పొటాషియంలో పదిశాతం మాత్రమే అందించగలదు.రాత్రి భోజనం తరువాత తినడం వల్ల నిద్ర బాగా పడుతుందన్న నమ్మకంతో ఎంతో మంది తింటూ ఉంటారు. ఇది ఒక అపోహ మాత్రమేనని అధ్యయనం చెప్పేసింది.

 రాత్రి కంటే ఉదయం తింటేనే బెటర్

అరటిపండ్లలో పోషకాలు ఎక్కువే. రోజుకో అరటి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే రాత్రి పడుకోబోయే ముందు తినడం ప్రత్యేకంగా ఎలాంటి లాభాలు రావు. రాత్రి పూట కన్నా ఉదయం పూటే అరటిపండును తినడం ముఖ్యం. రాత్రి పూట తింటే శ్లేష్మం ఉత్పత్తి అయి, జలుబు చేస్తుంది. అదే బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే మాత్రం ఎంతో మేలు కలుగుతుంది. అయితే మీకు డయాబెటిస్ సమస్య ఉంటే అరటి పండును అధికంగా తినకూడదు. అరటి పండు రక్తంలో చక్కెర సమస్యను అమాంతం పెంచేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ పండుకు కాస్త దూరంగా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 అరటిలో లభించేవి ఇవే..

☛ ఎనర్జీ: 65 కిలో కేలరీలు
☛ కార్బొహైడ్రేట్స్: 16.2 గ్రాములు
☛ ఫైబర్: 1.1 గ్రాములు
☛ పొటాషియం: 264 మిల్లీ గ్రాములు
☛ ప్రొటీన్: 1 గ్రాము
☛ ఫ్యాట్: 0.1 శాతం

Share post:

లేటెస్ట్