Mpox: ఆఫ్రికాను వణికిస్తోన్న ఎంపాక్స్.. 610 మందికిపైగా మృతి

Mana Enadu: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Mpox) వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశా(African Countries)ల్లో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్(Virus) మిగతా ఖండాల్లోని అనేక దేశాలకు పాకుతోంది. దీంతో ప్రజలతోపాటు ఆయా ప్రభుత్వాలు, అధికారులు ఆందోనళ చెందుతున్నారు. అటు ఆరోగ్య నిపుణులు సైతం భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కరోనా(Corona) విధ్వంసాన్ని చూసిన ప్రపంచానికి మరో విలయం తప్పదా అనే భయం WHOను వెంటాడుతోంది. ప్రస్తుతం కాంగో దేశంలో ఎంపాక్స్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇటీవల ఆ దేశంలో ఎంపాక్స్ వైరస్ సోకిన వారి సంఖ్య భారీగా పెరిగింది.

లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని సూచన

ఇదిలా ఉండగా కాంగో హెల్త్ మినిస్ట్రీ, మంత్రి రోజర్‌ కంబా(Roger Kamba) తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు కాంగో(Democratic Republic of the Congo)లో 18వేలకు పైగా ఎంపాక్స్ కేసులు రికార్డ్ అయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపుగా 610 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. విస్తరిస్తున్న వైరస్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఈ వైరస్ ప్రధానంగా లైంగిక సంబంధాలు(Sexual Contact), వైరస్‌ సోకిన వ్యక్తులకు దగ్గరగా ఉండడం, రోగులు వాడిన దుస్తులు వాడడం వల్ల వైరస్‌ సోకుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 ఎంపాక్స్‌ ఎమర్జెన్సీ కమిటీ ఛైర్మన్‌ ఆందోళన

కాంగోతో సహా అనేక దేశాల్లో కొత్త ఎంపాక్స్‌ స్ట్రెయిన్‌పై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు వైరస్‌ ఊహించినదానికంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, రూపంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపాక్స్‌ కొత్త స్ట్రెయిన్‌, క్లాడ్‌ ఐబీని కూడా గుర్తించారు. అటు నైజీరియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ ఎమర్జెన్సీ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్ డిమి ఒగోయినా ఆఫిక్రాలో ఎంపాక్స్‌ వైరస్‌ పరివర్తన, కొత్త స్ట్రెయిన్‌లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు అమెరికా, స్వీడన్‌, థాయ్‌లాండ్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఎంపాక్స్‌ ముప్పు నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. అనుమానిత కేసులను గుర్తిస్తే చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసింది.

DRC Health Minister Roger Kamba, Mpox, Kills over 610, Sexual Contact,WHO, African Countries, National News

Share post:

లేటెస్ట్