WHITE TEA : ఈ ‘టీ’ తాగితే చాలా యంగ్​గా కనిపిస్తారట!

ManaEnadu:కొందరికి చాయ్ తాగకపోతే మనసునపట్టదు. మరికొందరికి లేవగానే గొంతులో కాఫీ (Coffee) చుక్క పడకపోతే పొద్దుపోదు. ఇంకొందరేమో డైట్ చేస్తున్నామని టీ, కాఫీలు తాగమంటూ లెమన్ టీ, గ్రీన్ టీ తాగుతామంటారు. ఏదేమైనా మంచినీళ్ల తర్వాత ప్రపంచంలో ఎక్కువగా తీసుకునే పానీయాలు టీ, కాఫీ. ఇక టీ తాగితే ఉత్సాహంగా ఉంటారని.. కాఫీతో గుండె జబ్బులు రావని, లెమన్ టీ, గ్రీన్​టీ (Green Tea)లతో సన్నబడతారని అంటుంటారు. కొందరు నిపుణులు ఇది నిజమేనని చెబుతుంటారు. మరికొందరేమో ఎక్కువ మోతాదులో వీటిని తీసుకుంటే అనారోగ్యానికి గురవుతారని అంటారు. అందుకే చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా తాగడం మానేసి ఇప్పుడు హెర్బల్ టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో గ్రీన్ టీ, లెమన్ టీ (Lemon Tea)ని ఎక్కువగా తాగుతున్నారు.

అయితే ఇవే కాకుండా మరో రకం టీ (Tea) ఉంది. దాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వయసు మీద పడకుండా యంగ్​గా కనిపిస్తారని చెబుతోంది ఓ అధ్యయనం. ఇంతకీ ఆ టీ ఏంటంటే.. దాని పైరు వైట్ టీ (White Tea). వైట్ టీ తాగడం వల్ల జీవక్రియ పనితీరు మెరుగుపడటంతో పాటు బరువు తగ్గుతారని 2018లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్​లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. పోర్టో యూనివర్సిటీలో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్​లో ఫ్యాకల్టీ డాక్టర్ Ana Sousa ఈ పరిశోధనలో పాల్గొని వైట్ టీవల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. మరి ఇంతకీ ఆ టీ ఎలా చేసుకోవాలి? దాని ప్రయోజనాలు ఏంటో చూద్దామా?

వైట్ టీ తయారీ విధానం..

కామెలియా సినెన్సిస్‌ (Camellia sinensis) అనే తేయాకు మొక్క లేలేత ఆకులూ, మొగ్గలతో ఈ టీ తయారవుతుంది. మొదట కొన్ని నీళ్లు తీసుకుని ఓ పాత్రలో పోసి స్టవ్​పైన పెట్టాలి. అవి కాస్త వేడయ్యాక వాటిలో ప్రత్యేక పద్ధతిలో ఎండబెట్టిన కామెలియా సినెన్సిస్‌ వేయాలి. కాసేపు మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల తర్వాత తీస్తే టీ రెడీ అయినట్టే. అయితే ఈ టీ రుచి అంతగా నచ్చని వారు అందులో రుచికి సరిపడా తేనె (Camellia sinensis) కలుపుకుని తాగొచ్చు.

వైట్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

వైట్ టీలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ (Anti Accidents)​ గుణాలు కణాలు దెబ్బ తినకుండా కాపాడడం, వాపు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తాయి.
క్యాన్సర్​ రాకుండా ఉండే కణాలు ఈ టీలో ఉంటాయి. ఈ టీ పెద్ద పేగు, పొత్తి కడుపు, రొమ్మ క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
వైట్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ముడతలు, వృద్ధాప్య మచ్చలను తగ్గిస్తుంది. ఫలితంగా వయసు తక్కువగా కనిపిస్తారు.
వైట్​ టీలోని యాంటీ మైక్రో బయాల్​ గుణాలు రోగ నిరోధక శక్తి పెరుగుదలకు ఉపయోగపడతాయి.
తరచుగా వైట్ టీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు, అధిక రక్తపోటు (high blood pressure)ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడి సమస్యలు రావు.
ఇందులో L-theanine పదార్థం ఒత్తిడిని తగ్గించి ప్రశాతంగా ఉండేలా చేస్తుంది
వైట్​టీలోని యాంటీ బ్యాక్టీరియా గుణాలు దంత సమస్యలను దూరం చేస్తాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

గమనిక : ఇక్కడ అందించిన ఆరోగ్య సమాచారం అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే ఉత్తమం.

Share post:

లేటెస్ట్