Mana Enadu:కాంక్రీట్ జంగిల్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారా.. వీకెండ్ లో అలా హాయిగా ఎక్కడికైనా విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా.. మీరు కళను ప్రేమిస్తారా.. ప్రకృతిలో సేద తీరుతూ.. చరిత్రలో అబ్బురపరిచే అందాలు వీక్షించాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. అద్భుతమనిపించే శిల్ప కళలన్నీ ఒకే చోట కనువిందు చేసే అజంతా ఎల్లోరా అందాలను లైఫ్ లో ఒక్కసారైనా చూడాలని చాలా మంది అనుకుంటారు. మీ కోసమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అదిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది.
మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర పేరుతో వచ్చిన ఈ ప్యాకేజీలో మూడు రాత్రులు, నాలుగు పగళ్ల టూర్ లో ఈ అందాలను హాయిగా ఆస్వాదించొచ్చు. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ లో ఔరంగాబాద్, ఎల్లోరా, అజంతా ప్రదేశాలను వీక్షించొచ్చు. ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 27 వరకు అందుబాటులో ఉంది.
ప్రయాణం వివరాలు
DAY 1 : తొలిరోజు సాయంత్రం 6:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి (అజంతా ఎక్సెప్రెస్ – 17064) రైలు బయల్దేరుతుంది.
DAY 2 : మరుసటి రోజు తెల్లవారుజామున ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసుకున్న హోటల్ కు తీసుకెళ్తారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఎల్లోరా గుహలు, ఘృష్ణేశ్వర్ టెంపుల్, మినీ తాజ్‌మహల్ విజిట్ ఉంటుంది. రాత్రికి హోటల్‌కు చేరుకుని భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
DAY 3 : ఆ తర్వాత రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి అజంతాకు వెళ్తారు. అజంతా గుహలు విజిట్ చేసి సాయంత్రం తిరిగి ఔరంగాబాద్ కు వెళ్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు రైల్వే స్టేషన్‌కు చేరుకుని రాత్రి 10:45 గంటలకు హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ(ట్రైన్ నెంబర్ 17063) మొదలవుతుంది.
DAY 4 : మరుసటి ఉదయం 10 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
ధరలు చూస్తే:
కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్ -రూ. 22,920, ట్విన్ షేరింగ్ - రూ.12,650, ట్రిపుల్ షేరింగ్ – రూ.10,050.
స్టాండర్డ్‌లో సింగిల్ షేరింగ్ – రూ. 21,440, ట్విన్ షేరింగ్ – రూ.11,170, ట్రిపుల్ షేరింగ్ – రూ.8,570.