తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి?

ManaEnadu:తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్ష కీతో పాటు రెస్పాన్స్ షీట్​లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా కీ, రెస్పాన్స్‌షీట్లను విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

  ఈ ఏడాది జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు మొత్తం 11,062 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు రెండున్నల లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.  కంప్యూటర్ (సీబీటీ) పద్ధతిలో జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన కీని తాజాగా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ కీని  స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

మరోవైపు ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థులు కీపై ఉన్న అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ వివరాలు, కులం, ఈడబ్ల్యూఎస్ వంటి వివరాలు తప్పుగా నమోదు అయినా, టెట్ స్కోర్ మార్పులకు సంబంధించి ఈ నెల 20లోపు ధ్రువపత్రాలను జతచేస్తూ ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. *డీఎస్సీ ప్రైమరీ కోసం https://tgdsc.aptonline.in/tgdsc/ ఈ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *