తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనే శుభవార్త ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా రూ. 2500కోట్లతో మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తాను ప్రాతినిధ్యవ వహిస్తున్న మధిర నియోజకవర్గం నుంచే దీనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. వీటిలో భాగంగానే ఉన్నత విద్యపై కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించింది.ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెండ్స్కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2500కోట్ల మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా కాకుండా ఒకేచోట నిర్మించనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద తన అసెంబ్లీ మధిర నుంచే చేపట్టనున్నట్లు వెల్లడించారు. చింతకాని మండలంలో ని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న పది ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ బాలుర, ఎర్రపాలెం మండలంలో బాలిక రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని తెలిపారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పాఠశాలల భవన సముదాయాల కోసం స్థలాలు గుర్తించాలని అధికారులను భట్టి ఆదేశించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా భవనాలు నిర్మించాలని విద్యాశాఖను ఆదేశించారు. ఒకేచోట నిర్మిస్తే స్థలాల సమస్య అధిగమించడంతోపాటు మినీ ఎడ్యుకేషన్ హబ్ గా డెవలప్ చేసేందుకు వీలు ఉంటుందని డిప్యూటీ సీఎం అన్నారు.