ManaEnadu:రాజావారు రాణి వారు (Rajavaaru Ranivaaru), ‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’ (SR Kalyanamandapam) ఫేం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), హీరోయిన్ రహస్య గోరక్ (Rahasya Gorak) వివాహాం ఆగస్టు 22 శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
అతి కొద్ది మంది అతిధుల సమక్షంలో కర్ణాటక కూర్గ్‌లో ఈ ప్రేమజంట ఒక్కటయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మీరూ చూసేయండి.. కొత్త జంటను ఆశీర్వదించండి.
ఇదిలా ఉండగా.. ‘రాజావారు రాణిగారు’తోనే కిరణ్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో రహస్య కథానాయికగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరగగా తాజాగా వివాహం చేసుకున్నారు.
కిరణ్ అబ్బవరం చివరగా రూల్స్ రంజన్ (Rules Ranjann) సినిమాలో కనిపించగా ప్రస్తుతం కిరణ్ హీరోగా ‘క’ (Ka) సినిమా రూపొంది విడుదలకు రెడీ అవుతుండగా ఈ మూవీకి తన భార్య రహస్య సీఈవోగా పని చేయడం విశేషం.
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. సుజీత్, సందీప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ‘క’ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంది కూడా.
రాజావారు రాణి వారు, ‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’ ఫేం కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహాం ఆగస్టు 22 శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అతి కొద్ది మంది అతిధుల సమక్షంలో కర్ణాటక కూర్గ్‌లో ఈ ప్రేమజంట ఒక్కటయింది.