ManaEnadu:ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. టాలీవుడ్ లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-8 లాంఛింగ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రోమోలతో ఈ సీజన్ పై ఆసక్తి పెంచిన నిర్వాహకులు ఇప్పుడు తాజాగా షో ప్రారంభమయ్యే రోజును అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ సీజన్-8కు సంబంధించిన మరో ప్రోమో రిలీజ్ చేసి అందులో ఈ తేదీని అనౌన్స్ చేశారు. మరి ఇంతకీ ఈ షో ప్రారంభమయ్యేది ఎప్పుడంటే..
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 7 గంటలకు బిగ్‌బాస్ 8 గ్రాండ్ లాంఛ్ జరగనున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. బిగ్ బాస్ 1,2,3 తప్ప 4వ సీజన్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ లోనే షోను ప్రారంభిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సీజన్-8కు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఎనిమిదో సీజన్‌ను సెప్టెంబర్‌లోనే మొదలుపెట్టనున్నారు.
ఇక మొదటి నుంచి ఈ సీజన్ పై ఆసక్తిని కలిగిస్తూ.. హైప్ ను క్రియేట్ చేస్తూ హోస్టు నాగార్జునతో పలు రకాల ప్రోమోలు రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ప్రోమోల్లో నాగార్జునతో పాటు కమెడియన్ సత్య సందడి చేశారు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదనే ట్యాగ్ లైన్ తో ఈసారి సీజన్ కాస్త డిఫరెంట్ ఉండబోతోందనే హింట్ ఇచ్చాడు నాగార్జున.
సాధారణంగా బిగ్‌బాస్ హౌజ్ అంటే.. ఒకటే ఇంట్లో సెలబ్రిటీలందరితో షో నడిపిస్తారు. కానీ ఈ సీజన్ లో రెండు హౌజులు ఉంటాయని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కొంతమంది కంటెస్టెంట్లను ఒక హౌస్ లో ఉంచి.. మిగాత వారిని రెండో హౌస్ లో ఉంచి.. షో చివర్లో రెండో ఇంట్లో ఉంచిన వారిని మొదటి ఇంట్లోకి పంపిస్తారట. ఇవి రూమర్స్ మాత్రమే. దీనిపై క్లారిటీ రావాలంటే సెప్టెంబర్ 1వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.