Mana Enadu: సినీ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత (Silk Smitha) అంటే మాత్రం తెలియని వారంటూ ఉండరు. హీరోయిన్ అవ్వాలని సినీ పరిశ్రమకు వచ్చిన ఆమెకు అనుకున్న అవకాశాలు రాలేదు. పైగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. దీంతో ఐటెం గాళ్‌గా మారింది. తన అందం, డ్యాన్స్‌తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల సినిమాల్లోనూ సిల్క్ స్మిత నటించి స్టార్‌డమ్ దక్కించుకుంది. ఓ విధంగా చెప్పాలంటే మొదటి పాన్ ఇండియా స్టార్ సిల్క్ స్మిత అనే చెప్పాలి.
అయితే కెరీర్‌లో సినిమాల పరంగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో ఆమె సూసైడ్ చేసుకొని మరణించింది. ఆమె మృతికి కారణాలు ఏంటన్నదీ ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సిల్క్ స్మిత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’ లో కూడా కల్పితమే ఎక్కువగా ఉందని పలువురు కామెంట్ చేశారు. అయితే సిల్క్ స్మితతో కలిసి పలు సినిమాల్లో నటించిన జయమాలిని (Jayamalini) ఇటీవల సిల్క్ స్మితపై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు ‘ఆమె చేసిన పెద్ద తప్పు అదే. ప్రేమించడం తప్పు కాదు. కానీ, తల్లిదండ్రులను విడచిపెట్టి ఉండకూడదు. ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మడం చాలా పెద్ద తప్పు. అతను ఆమెను బాగా మోసం చేశాడు. అందువల్లే ఆమెకు ఆ పరిస్థితి వచ్చింది’ అని జయమాలిని అన్నారు.
నిజంగా ఆ ఆలోచనే అద్భుతం
ఇదిలా ఉండగా ఓ సినిమా షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత ఆపిల్ కొరికిందట. వెంటనే షాట్‌కి రెడీ అనడంతో ఆ ఫ్రూట్ పక్కన పెట్టి షూటింగ్‌కి వెళ్లిందట. అది గమనించిన ఓ వ్యక్తి ఆ ఆపిల్ తీసుకొని సిల్క్ స్మిత కొరిన ఆపిల్ అంటూ వేలం వేస్తే దాన్ని కొనేందుకు జనం ఎగబడ్డారట. అయితే దీనిపై భిన్న వాదనలూ లేకపోలేదు. కొందరు రూ.2 లక్షలు పలికిందంటే.. మరికొందరు రూ.200 మాత్రమే అని అనేవారట. ఏది ఏమైనా ఇలా వేలం వేయాలనే థింకింగ్ రావడమే గొప్ప విషయం.