ManaEnadu:‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్ పాత్ర జోకర్లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు హీరోలు, ఇతర ప్రముఖులు స్పందించారు. వార్సి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభాస్ స్టార్డమ్ తెలియకుండా మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. తాజాగా ఈ వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINETAA)కు లేఖ రాశారు. అర్షద్ వార్సీ ప్రభాస్‌పై చేసిన కామెంట్స్.. టాలీవుడ్ నటులు, అభిమానుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని CINETAA అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్‌కు రాసిన లేఖలో మంచు విష్ణు పేర్కొన్నారు.
“ప్రతి వ్యక్తికి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంది. దాన్ని మేమూ గౌరవిస్తున్నాం. కానీ, అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ ప్రభాస్‌ను తక్కువ చేసేలా ఉన్నాయి. ఆయన అలా మాట్లాడినందుకు మేం చాలా బాధపడుతున్నాం. సోషల్ మీడియా యుగంలో ఇలాంటి కామెంట్స్ ఎక్కువ వైరల్ అవుతాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. దయచేసి సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తపడాలి. మాటకు చాలా పవర్ ఉంటుంది. అది ఇద్దరి మధ్య బంధాలను బలపరచగలదు, గొడవలూ పెట్టగలదు.”
“అర్షద్ కామెంట్స్ నెగెటివిటీని తీసుకొచ్చేలా ఉన్నాయి. నటుల మధ్య యూనిటీ, గౌరవం కోసం ఎప్పుడూ ముందుండే CINETAA అర్షద్ వార్సీ కామెంట్స్‌పై స్పందిస్తుందని భావిస్తున్నాం. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఆయనకు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాం. ప్రాంతాలతో, భాషతో సంబంధం లేకుండా అందరూగౌరవంగా ఉండాలని కోరుతున్నాం. మనమంతా ఒకే కుటుంబంలో భాగమని అందరూ గుర్తుంచుకోవాలి. కలిసికట్టుగా ఉందాం. ఈ యూనిటీ కాపాడుకుందాం.” అని మంచు విష్ణు CINETAA అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.






