Nani:ప్రభాస్ – అర్షద్ వార్సీ వివాదం.. నేను అలా మాట్లాడినందుకు బాధ పడుతున్నా : నాని

ManaEnadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్​గా మారాయి. కల్కిలో ప్రభాస్ పాత్ర (భైరవ) జోకర్​లా ఉందని అర్షద్ వార్సీ అన్న విషయం తెలిసిందే. ఈ కామెంట్స్​పై టాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు, నటులు ఈ విషయంపై స్పందించారు. ప్రభాస్​కు ఉన్న క్రేజ్, ఆయన మేనియా గురించి తెలియకుండా మాట్లాడారని ఫైర్ అయ్యారు.

నేచురల్ స్టార్ నాని కూడా దీనిపై స్పందించారు. ఇటీవల సరిపోదా శనివారం’ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నాని ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రభాస్​పై అలాంటి కామెంట్స్​ చేసినందుకు అర్షద్‌కు ఎన్నడూ రానంత ఫేమ్‌ వచ్చిందని అన్నాడు. ఇక అప్పటి నుంచి అర్షద్​పై నాని చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. దీంతో నాని తన కామెంట్స్​పై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

సరిపోదా శనివారం సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలో ప్రమోషన్స్​లో బిజీబిజీగా ఉన్నాడు నాని. ఈ సందర్భంగా అక్కడ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్షద్​పై తాను చేసిన కామెంట్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు. అతడి గురించి తాను అలా మాట్లాడినందుకు చింతిస్తున్నాననంటూ చెప్పాడు.

“అర్షద్ చాలా మంచి యాక్టర్. మున్నాబాయ్ సినిమా నుంచి ఆయనంటే తెలుగు ప్రేక్షకులకు ఇష్టం. అయితే సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు మనం మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పదాల ఎంపికలోనూ జాగ్రత్తగా ఉండాలని నాకు ఇప్పుడు అర్థమైంది. అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు నేను, అర్షద్ బాధితులమయ్యాం.”

” ప్రభాస్ గురించి అర్షద్ చేసిన కామెంట్స్, ఆయనపై నేను చేసిన వ్యాఖ్యలు ఎలా వైరల్​గా మారాయో నేను చూశాను. ఆ తర్వాత అర్షద్ ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ఆ తర్వాతే మీడియా, సోషల్ మీడియా మొత్తం ఆయన కామెంట్స్​ను తప్పుదోవ పట్టించిందని తెలుసుకున్నా. అది తెలుసుకోకుండా నేను కామెంట్స్ చేశాను. నా మాటలు కూడా మరోవిధంగా జనంలోకి వెళ్లాయి.” అని నాని అసలు సంగతి చెప్పుకొచ్చాడు.

అయితే నాని హైదరాబాద్​లో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, ముంబయికి వెళ్లాక మాట మార్చాడంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సరిపోదా శనివారం హిందీలో కూడా రిలీజ్ అవుతోందని.. అక్కడి మార్కెట్ కోసం మాట మార్చారంటూ ట్రోల్ చేస్తున్నారు. సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడొద్దూ.. నానికి సపోర్టుగా మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *