Prashanth Neel : అప్పుడు కేజిఎఫ్.. ఇప్పుడు సలార్.. షారుఖ్ మీద పోటీకి ప్రశాంత్ నీల్..

డంకీ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా సలార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇపుడు సినిమా ప్రేక్షకుల అందరి దృష్టి సలార్(Salaar), డంకీ(Dunki) సినిమాల పైనే ఉంది. షారుఖ్ జవాన్, పఠాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల భారీ హిట్స్ కొట్టి ఇప్పుడు డంకీ తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ప్రభాస్ సలార్ పార్ట్ 1 సినిమాతో భారీ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. డంకీ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా సలార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

డంకీ సినిమా డిసెంబర్ 21న రిలీజవుతుండగా సలార్ డిసెంబర్ 22న రిలీజవుతుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ క్లాష్ ఏర్పడనుంది. అయితే ప్రశాంత్ నీల్ షారుఖ్ మీద పోటీకి ఇది రెండో సారి కావడం గమనార్హం. గతంలో షారుఖ్ 21 డిసెంబర్ 2018లో ‘జీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే రోజు ప్రశాంత్ నీల్ యశ్ తో తెరకెక్కించిన కేజిఎఫ్ రిలీజయింది. జీరో సినిమా పరాజయం పాలవ్వగా కేజిఎఫ్ పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అయింది.

ఇప్పుడు మళ్ళీ అయిదేళ్ల తర్వాత అదే సీన్ రిపీటవుతుంది. షారుఖ్ అదే డేట్ 21 డిసెంబర్ డంకీ సినిమాతో రాబోతుంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కిన సలార్ సినిమాని ఒక రోజు తేడాతో 22 డిసెంబర్ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సారి ఎవరు విజయం సాధిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఎవరికి వారు అభిమానులు, చిత్రయూనిట్ తమ సినిమాలు హిట్ అవుతాయని చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో షారుఖ్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా జరుగుతుంది. షారుఖ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, హ్యాట్రిక్ కొడతాడని, ప్రభాస్ వరుస పరాజయాల్లో ఉన్నాడు ఇది కూడా పోతుందని, షారుఖ్ ముందు ప్రభాస్ నిలవలేడని షారుఖ్ అభిమానులు సొషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి ప్రభాస్ అభిమానులు కౌంటర్ ఇస్తూ ఇటీవల సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్ లో పెద్ద హిట్ అవుతున్నాయని, డంకీ మీద హైప్ లేదని, ప్రభాస్ హిట్ కొడతాడని పోస్టులు చేస్తున్నారు. ఇక సినిమా అభిమానులు మాత్రం రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు. మరి డంకీ, సలార్ సినిమాలు ప్రేక్షకులని ఎలా ఇంప్రెస్ చేస్తాయో, ఏ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో చూడాలి

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *