Thangalaan: ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. కానీ, ట్విస్ట్ ఏంటంటే?

ManaEnadu: డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తమిళ హీరో విక్రమ్(Vikram) ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల ఆయన అలాంటి కాన్సెప్ట్‌తోనే అభిమానుల ముందుకు వచ్చారు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో వచ్చిన చిత్రం తంగలాన్(Thangalaan). డైరెక్టర్ రంజిత్(Director Ranjith) దర్శకత్వం వహించిన ఈ మూవీలో అందాలరాశి మాళవిక మోహనన్(Malavika Mohanan) నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించింది. అలాగే పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై నెల రోజులు పూర్తయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్‌ అయింది. తాజాగా ఈ మూవీ శ‌నివారం ఓవ‌ర్‌సీస్ ఓటీటీ(Overseas OTT)లో రిలీజైంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో సెప్టెంబ‌ర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్(Action Adventures) థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కింది.

 ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం?

విక్ర‌మ్ తంగలాన్ మూవీ స‌డెన్‌గా OTTలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ ఎంథుస‌న్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ఓటీటీలో ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ మాత్ర‌మే తంగ‌లాన్ మూవీని వీక్షించే అవ‌కాశం ఉంది. ఇండియ‌న్ ఆడియెన్స్ తంగ‌లాన్ మూవీని ఓటీటీలో చూడాలంటే మ‌రికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. తంగ‌లాన్ హెచ్‌డీ వెర్ష‌న్‌(HD version) ప‌లు ఆన్‌లైన్ పైర‌సీ సైట్స్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి విక్ర‌మ్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. తంగ‌లాన్ OTT హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. సెప్టెంబ‌ర్ 20న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళం, తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఒకే రోజు విడుద‌ల కానున్న‌ట్లు చెబుతోన్నారు. తంగ‌లాన్ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ 35 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

రూ. 100 కోట్లతో రూపొందినా కలెక్షన్స్ అంతంతే..

దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన తంగ‌లాన్ డెబ్బై కోట్ల‌లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌(commercial failure)గా నిలిచింది. విక్ర‌మ్, పార్వ‌తి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తంగ‌లాన్ పాత్ర‌లో కెరీర్‌లో బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్‌ను విక్ర‌మ్ క‌న‌బ‌రిచాడంటూ ఫ్యాన్స్ తో పాటు క్రిటిక్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. బ్రిటీష‌ర్ల కాలంలో బ‌ల‌హీన వ‌ర్గాల ప‌ట్ల ఉన్న వివ‌క్ష‌ను యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు పా రంజిత్ ఈ మూవీలో చూపించారు. గిరిజ‌న తెగ నాయ‌కుడు తంగ‌లాన్ (విక్ర‌మ్‌) భూమిని ప‌న్ను క‌ట్ట‌లేద‌న్న సాకుతో ఊరి జ‌మీందార్ లాక్కుంటాడు. జ‌మీందారు నుంచి భూమిని తిరిగి సొంతం చేసుకోవ‌డానికి బ్రిటీష్ దోర క్లైమెంట్‌తో క‌లిసి ఊరికి స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ఉన్న బంగారు నిధిని వెలికితీయ‌డానికి వెళ‌తాడు తంగ‌లాన్‌. అత‌డి వెంట ఊరివాళ్ల వ‌స్తారు. అయితే బంగారు నిధి(gold treasure)ని ఆర‌తి (మాళ‌వికా మోహ‌న‌న్‌) అనే నాగ‌జాతికి చెందిన మాంత్రికురాలు కాపాడుతుంటుంది. ఆర‌తి బారి నుంచి త‌న‌వాళ్ల‌ను తంగ‌లాన్(Thangalaan) ఎలా కాపాడుకున్నాడు? క్లైమెంట్‌తో క‌లిసి బంగారు నిధిని తంగ‌లాన్ వెలికితీశాడా? అడ‌విలో అడుగుపెట్టిన తంగ‌లాన్‌కు ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *