Mana Eenadu: స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో రానా దగ్గుబాటి(Rana Daggubati) ఒకరు. తన ఫస్ట్ మూవీ నుంచి సెలక్టీవ్ చిత్రాలనే చేస్తూ టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో తన ముద్ర వేశారు రానా. లీడర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ ఆరు అడుగుల హీరో.. పలు హిందీ చిత్రాల్లోనూ కీలక పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గానూ నటిస్తూ తనలోని డిఫరెంట్ యాక్టర్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నాడీ హీరో. తెలుగులో నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, ఆరంభం, రుద్రమదేవి, బాహుబలి(Bahubali), బాహుబలి 2(Bahubali-2), నేనే రాజు నేనే మంత్రి, ఎన్టీఆర్ కథానాయకుడు, అరణ్య, భీమ్లా నాయక్, విరాట పర్వం వంటి చిత్రాలలో తన నటనతో మెస్మరైజ్ చేశాడు రానా. డిపార్ట్‌మెంట్, యే జవానీ హై దివానీ, సమ్ థింగ్ సమ్ థింగ్, వెల్ కమ్ టు న్యూయార్క్, హౌజ్ ఫుల్ 4 వంటి హిందీ చిత్రాల్లోనూ మెప్పించాడు ఈ ఆరడుగుల ఆజానుభాహుడు.
అంతా ఓ ట్విస్ట్
అయితే నాలుగేళ్ల క్రితం అంటే ఆగస్టు 8, 2020లో రానా మోడల్ మిహికా బజాజ్(Miheeka bajaj)ను వివాహమాడారు. అయితే తాజాగా తన పెళ్లిపై రానా కమిటీ కుర్రోళ్లు మూవీ చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తన పెళ్లి తంతు అంతా ఓ కలలా, ట్విస్టీగా జరిగిందని చెప్పుకొచ్చారు రానా. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు.. ప్రేమ, డేటింగ్ పూర్తయ్యాక ఓ పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఎంగేజ్మెంట్ ఆ తర్వాత కొద్ది రోజులకు డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇలా అన్నీ ఉంటాయని, కానీ తన లైఫ్‌లో అలాంటివేమీ లేవని చెప్పాడీ హీరో. తన పెళ్లి చాలా కరోనా టైంలో, చాలా సింపుల్‌గా జరిగిందని చెప్పారు.
కరోనాలో అలా కలిశాం..
అయితే ఇక్కడ మేటర్ అదికాదు.. రానా తన భార్య మిహికాతో ప్రేమలో పడటం అనేది పెద్ద ట్విస్టింగ్ గా ఉంటుంది. ‘కరోనా సమయంలో కొత్త కొత్త వాళ్లతో పరిచయం పెంచుకునేందుకు హౌస్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేశా. అందులోనే మిహికాతో పరిచయమైంది. ఆ తర్వాత వారానికే నా పెళ్లైంది. ఇది నిజమా? వీడు మెంటలోడా? అని మిహికా కూడా కన్‌ఫ్యూజ్ అయింది. ఇదే నా జీవితంలో వైల్డెస్ట్ థింగ్’ అని నవ్వుతూ చెప్పారు. ఇలా తన జీవితంలో పెళ్లి అనేది చాలా క్రేజీగా జరిగిందని చెప్పి కొచ్చాడు ఈ అరడగుల హీరో. ఇదండీ రానా-మిహికాల మ్యారేజ్ మేటర్.