ManaEnadu:టాలీవుడ్ లో మరో రెండ్రోజుల్లో సినీ జాతర జరగబోతోంది. ఆగస్టు 15వ తేదీన ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఊరమాస్ జాతర చేయడానికి టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఊరమాస్ గా మారిన చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని వస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఈనెల 15న థియేటర్లలో మాస్ బరాత్ జరగబోతోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్మార్ట్ ఫ్యాన్స్ కు మేకర్స్ సూపర్ అప్డేట్ ఇచ్చారు.
ఇట్స్ డబుల్ ఇస్మార్ట్ బుకింగ్ టైమ్ అంటూ ఈ సినిమా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ను మేకర్స్ ప్రారంభించారు. డబుల్ ధిమాకోడి మాస్ బరాత్ షురూ అయింది రో.. డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ మొదలయ్యాయి. మీ టికెట్స్ బుక్ చేసుకొని.. పండుగ చేస్కోండి.. అంటూ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ను వదిలారు. దీంతో మూవీ లవర్స్ పండుగ చేస్కుంటున్నారు. ఇలా అప్డేట్ వచ్చిందో లేదో.. అలా సినిమా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ హైప్ ఇచ్చిందో తెలిసిందే. ఇక డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు డబుల్ ఎంట్ర్టైన్మెంట్ ఇస్తోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఈసారి ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ తో పాటు బిగ్ బుల్ గా సంజయ్ దత్ కూడా సందడి చేయనుండటంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య సీన్లు ట్రైలర్ లో చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు 70 ఎంఎం స్క్రీన్ పై వీళ్ల ఫైట్ చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. మరో రెండ్రోజుల్లో ఈ సినిమాను చూసేయబోతున్నామని ఆనంద పడుతున్నారు.
ఇక ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా పూరీ కనెక్ట్స్ బ్యానర్ పూరీ, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. గెట్ రెడీ మాస్ ఫోక్స్. ఈ 15న థియేటర్లలో శంకర్ గాడి మాస్ జాతరకు మనమూ పోదామా..?