మెగా ఫ్యాన్స్​ కు షాకింగ్ న్యూస్.. ‘ఇంద్ర’ రీ రిలీజ్ ఇప్పట్లో లేనట్టే!

ManaEnadu:ప్రస్తుతం టాలీవుడ్​లో రీ రిలీజ్​ల ట్రెండ్ నడుస్తోంది. తమ ఫేవరెట్ హీరో నటించిన సినిమాలు రిలీజ్ అయిన సమయంలో థియేటర్​లలో చూడలేకపోయిన వారికి ఈ రీ రిలీజ్ మరో ఛాన్స్​ను ఇస్తోంది. ఈ క్రమంలోనే రీ రిలీజ్​లకు భారీ ఎత్తున క్రేజ్ లభిస్తోంది. తాజాగా ఆగస్టు 9వ తేదీన సూపర్ స్టార్ మహేశ్ బాబు మురారి మూవీ రీ రిలీజ్ అయింది. ఇక సినిమా చూసేందుకు థియేటర్​కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. అయితే ఇదే నెలలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కూడా ఉంది. ఆగస్టు 22వ తేదీన ఆయన బర్త్ డే సందర్భంగా చిరు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్రను రిలీజ్ చేయాలని వైజయంతి మూవీస్ నిర్ణయించింది. దీనిపై అప్పట్లో అధికారికంగా ప్రకటన కూడా చేసింది.

కానీ మెగా ఫ్యాన్స్​కు షాకిచ్చే ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చిరు పుట్టిన రోజున ఇంద్ర సినిమా రీ రిలీజ్ ఉండదనే వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఆగస్టు 15వ తేదీన నాలుగు పెద్ద సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, ఖేల్ ఖేల్ మే విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో దాని తర్వాత వారం 22న ఇంద్ర రీ రిలీజ్ చేస్తే థియేటర్లు దొరకకపోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇంద్ర రీ రిలీజ్​ను వాయిదా వేయనున్నట్లు వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. తమ ఫేవరెట్ హీరో పుట్టిన రోజున ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీని చూడాలనుకున్న వారి ఆశ నిరాశే అయిపోయింది.

ఇక ఇంద్ర సినిమాకు వస్తే.. బి.గోపాల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్​ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమాలో నటనకు చిరంజీవి 2002లో నంది పురస్కారం అందుకున్నారు. సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ ‘వీరశంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేయాలని చూస్తే పీక కోస్తా’, ‘షౌకత్ ఆలీ ఖాన్.. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని పోతున్నాను. అదే నీ వైపు ఉండి ఉంటే ఇక్కడి నుండి తలలు తీసుకెళ్లేవాడిని’, ‘సింహాసనం పై కూర్చుండే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనా రెడ్డిది.’ ‘ అనే డైలాగ్​లో ఈ సినిమాకే హైలైట్​గా నిలిచాయి.

 

Share post:

లేటెస్ట్