ManaEnadu:ప్రతినెల చివరి ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలతో మనసు విప్పి మాట్లాడే కార్యక్రమం మన్ కీ బాత్. టీవీకే ఆదరణ తగ్గుతున్న సమయంలో రేడియోను ఎంచుకుని ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు చివరి ఆదివారమైన నేడు మోదీ ప్రజలతో తన మనుసులోని భావాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వికసిత్ భారత్, రాజకీయాల్లో యువత పాత్ర, భారత అంతరిక్ష అభివృద్ధి, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.
అభివృద్ధి చెందిన భారత్, బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత ప్రజా జీవితంలోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 113వ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. ఎలాంటి నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశాన్ని పటిష్ఠం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వారసత్వ రాజకీయాలు కొత్త టాలెంట్‌ను అణిచివేస్తాయి..
“రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దేశం కోసం వారు తమని తాము పూర్తిగా అంకితమిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మనం మరోసారి అదే స్ఫూర్తిని ఫాలో అవ్వాలి. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం కావాలి. కుటుంబ రాజకీయాలు నూతన ప్రతిభను అణచివేస్తాయి.” అని మోదీ వ్యాఖ్యానించారు.
అంతరిక్ష రంగంలో భారత్ ప్రతిభ అద్భుతం
అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోందని, చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహించుకున్నామని మోదీ అన్నారు. అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మోదీ ముచ్చటించారు. ఈ ఏడాదే తొలి అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకొన్నామని .. ఈ రంగంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో యువత పెద్ద ఎత్తున లబ్ధి పొందిందని తెలిపారు. రానున్న కాలంలో యువత అంతరిక్షంలో ప్రయోగాలు చేసే దిశగా పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు.
“ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామం. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఆవిష్కరించాం. స్వాతంత్య్ర దినోత్సవం సామాజిక వేడుకగా మారింది. నా పిలుపు మేరకు దాదాపు ఐదు కోట్లకు పైగా మంది జాతీయ జెండాతో ఫొటోలు దిగి వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశారు. దేశంపై భారతీయులంతా తమ భక్తిని చాటుకోవడం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది.” అని మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…