Mana Enadu: అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల(Brothr & Sister’s)అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్(Raksha Bandhan). సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఈ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మరి సోదరులు కూడా వారికి బహుమతులు ఇవ్వాలి కదా! మారుతున్న ఈ కాలంలో ఎప్పటిలా ఏదో ఒక గిఫ్ట్(Gifts)ఇచ్చి ఊరుకుంటే సరిపోతుందా? కేవలం బహుమతులు ఇవ్వడమే కాకుండా.. జీవితాంతం సోదరికి రక్షగా నిలవాల్సిన బాధ్యత కూడా సోదరులపై ఉంటుంది. చిన్న గిఫ్ట్స్‌తో వారికి తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే బదులు ఆర్థికంగా భరోసానిచ్చే గిఫ్ట్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఓ సారి ఆలోచించారా.. అవేంటో ఓ సారి చూద్దామా..
బీమాతో ధీమా
మన జీవితంలో అనుకోని ప్రమాదాలు ఎప్పుడైనా ఎదురుకావొచ్చు. అప్పుడు వైద్య ఖర్చుల కోసం రూ.లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అందుకే మీ అక్క/చెల్లి పేరుతో టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి. పండగ సందర్భంగా వారికోసం ఈ పాలసీ తీసుకుంటే.. అనారోగ్య సమయంలో ఆపన్న హస్తంలా పనిచేస్తుంది. వారి పేరుతో ఈ పాలసీ తీసుకుంటే.. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో వారికి మంచి బహుమతి ఇచ్చినవారవుతారు.
షేర్స్ కొనివ్వండి
కొన్ని కంపెనీ షేర్లను కూడా మీరు మీ సోదరికి బహుమతిగా ఇవ్వొచ్చు. చిన్న వయస్సులోనే వారికి షేర్లను కొనిస్తే.. వారు పెద్దయ్యే వరకు ఆ షేర్ల ధర చాలా పెరుగుతుంది. షేర్లలో పెట్టుబడులు ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు కాబట్టి వారు ఆ పెట్టుబడులను ఇతర కంపెనీలకు మార్చుకొనే అవకాశం కూడా ఉంటుంది.
రూ.50 పాకెట్ మనీతో..
చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు అంటూ రోజూ వారు మీ దగ్గర నుంచి ఎంతోకొంత నొక్కుతూనే ఉంటారు. అయితే ప్రతిరోజు వారికోసం రూ.50 సేవ్ చేస్తే.. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో చెల్లించినవారవుతారు. ఉదాహరణకు రోజుకు రూ.50 చొప్పున నెలకు రూ.1500 జమవుతాయి. వాటిని నెలనెలా సిప్ రూపంలో భద్రపరిస్తే.. 10 ఏళ్లకు 12% వడ్డీతో రూ.3.5 లక్షల వరకు జమవుతాయి.
ఎమర్జెన్సీ సపోర్ట్ కోసం..
ఆడపిల్లలకు అనుకోని ఖర్చులు ఎప్పుడైనా రావొచ్చు. ఆ సమయంలో వారు ఆందోళన చెందకుండా.. అత్యవసర నిధి ఏర్పాటు చేసి రాఖీ కానుకగా ఇవ్వొచ్చు. ఇలా చేస్తే పెట్టుబడులను ఉపసంహరించుకోవాల్సి పని ఉండదు. అప్పు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ అత్యవసర నిధిలో కనీసం 4 నెలలకు సరిపడే ఖర్చులు ఉండేలా చూసుకోవాలి.
గోల్డ్ గిఫ్ట్స్
భవిష్యత్తులో కొనివ్వడం కన్నా ఇప్పుడు కొంటేనే బెటర్. పైగా ఈమధ్యే పసిడి రేట్లు పడిపోయాయి. మీ సోదరీమణులకు బహుమతి ఇవ్వడానికి ఇదే సరైన సమయం. సో.. ఈసారి రాఖీకి ఇలా డిఫరెంట్ ట్రై చేయండి.. స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి మీ సోదరీమణులను ఆశ్చర్యపర్చండి..