రిటైర్డ్ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్పీ గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు.
ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో గులాబీ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని ఆర్ఎస్పీ భావించారు. కానీ బీఆర్ఎస్‌తో పొత్తు బీఎస్పీ చీఫ్ మాయవతి ఒప్పుకోకపోవడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
బీఎస్పీకి రిజైన్ చేసిన ఆర్ఎస్పీ అభిమానులు, కార్యకర్తలతో చర్చించి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ భవన్ నుండి ర్యాలీగా వెళ్లిగా వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని సమాచారం. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీ రిజర్వుడ్ సెగ్మెంట్ అయిన నాగర్ కర్నూల్ స్థానం నుండి ఆర్ఎస్పీని బరిలోకి దించాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తోన్నట్లు సమాచారం.