600 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గిన ఖలీద్.. ఈ స్మైలింగ్ మ్యాన్ గురించి తెలుసా?

ManaEnadu:ఖలీద్‌ బిన్ మొహసేన్ షారీ.. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తి. ఇప్పుడు ఏకంగా 542 కేజీల బరువు తగ్గిపోయి 610 కేజీల నుంచి 60 కేజీలకు వచ్చేశాడు. అయితే ఖలీద్ బరువు ప్రయాణంలో అతడికి ఓ రాజు ఎంతో సహకరించాడు. ఆయన సాయంతోనే ఖలీద్ ప్రాణం నిలిచిందని చెప్పొచ్చు. మరి ఖలీద్ 600 నుంచి 60 కేజీల వరకు ఎలా తగ్గాడో తెలుసుకుందామా..?

సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్‌ 2013లో 610 కేజీల బరువు పెరిగాడు. భారీ దేహంతో నానా అవస్థలు పడేవాడు. సాధారణంగా 80 నుంచి 100 కేజీలుంటేనే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి 600 కేజీలంటే ఇక ఎలా ఉంటుందో పరిస్థితి ఊహించుకోండి. అలా ఖలీద్ అధికర బరువు వల్ల మూడేళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి. ఇంకొన్నాళ్లు అలాగే ఉంటే ఆయన ప్రాణానికి ముప్పు వచ్చేది. కానీ అలా జరగలేదు.

ఖలీద్‌ స్టోరీ విన్న మునుపటి సౌదీ రాజు అబ్దుల్లా అతడికి సాయం చేసి కాపాడాలని నిర్ణయించుకున్నారు. తన సొంత ఖర్చులతో ఖలీద్‌కు వైద్య సేవలు అందించారు. మొదటగా ప్రత్యేకంగా ఒక బెడ్ డిజైన్ చేయించి అతడిని రియాద్‌లోని కింగ్‌ ఫాహద్ మెడికల్ సిటీకి తరలించి ప్రత్యేకంగా వైద్యులను నియమించారు. 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు ఖలీద్​కు చికిత్స చేయడం మొదలు పెట్టారు.

మొదట ఒక డైట్ చార్ట్ రెడీ చేశారు. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ బైపాప్ సర్జరీ చేసి శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు వ్యాయామాలు చేయించం మొదలు పెట్టారు. అలా నెమ్మదిగా ఆయన శరీరంలో కదలికలు స్పీడ్ పెంచాక.. ఫిజియోథెరపీ నిర్వహించడంతో ఆరు నెలల్లో సగానికి సగం బరువు తగ్గాడు. 2023లో 542 కేజీలు తగ్గి అందర్నీ షాక్​కు గురిచేశాడు. 600 కేజీలున్న వ్యక్తి కాస్తా 60 కేజీలతో హెల్దీ మ్యాన్ అయ్యాడు. అయితే ఈ ప్రాసెస్​లో అదనపు చర్మం తొలగించేందుకు కొన్ని సర్జరీలు చేయాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. బరువు తగ్గిన ఖలీద్​ను ఇప్పుడు అందరూ స్మైలింగ్ మ్యాన్‌ అంటూ పిలుస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *