ప్రపంచంలోనే ది బెస్ట్ దేశంగా ‘స్విట్జర్లాండ్’.. భారత్ ర్యాంక్ ఎంతంటే?

ManaEnadu:స్విట్జర్లాండ్‌ (Switzerland). ఈ పేరు వినగానే రాజకీయ నాయకుల ‘బ్లాక్‌ మనీ’ ఆరోపణలే చాలా మందికి గుర్తొస్తాయి. కానీ స్విస్ అంటే అందమైన ఆల్ప్స్‌ పర్వతాలు, ప్రకృతి సోయగాలకు నిలయం. పర్యాటకులకు స్వర్గధామం. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కచ్చితంగా తమ లైఫ్​లో ఒక్కసారైనా చూడాలనుకునే ప్రదేశం స్విస్. చాలా చిన్న దేశమే అయినా ఈ దేశానికి టూరిస్టుల తాకిడి ఎక్కువ.

వరుసగా మూడోసారి..

తాజాగా ఈ బుజ్జి దేశం ఓ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ తాజాగా ‘బెస్ట్‌ కంట్రీస్‌ ర్యాంకింగ్‌ 2024 (Best Countries Rankings)’ రిపోర్ట్‌ విడుదల చేసింది. ఈ నివేదికలో స్విట్జర్లాండ్‌ నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. ఇది మొదటిసారి కాదండోయ్. వరుసగా మూడో ఏడాది ఈ దేశం అగ్రస్థానంలో నిలవడం విశేషం.

ఏడు సార్లు బెస్ట్ కంట్రీగా నం.1 ర్యాంకు..

స్విట్జర్లాండ్​లో జీవన నాణ్యత పరిమాణాలు, సంస్కృతి, సంప్రదాయాలు, సాహసం, వ్యాపార అవకాశాలు, వారసత్వం వంటి అంశాల ఆధారంగా సర్వే చేపట్టి యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. మొత్తం 89 దేశాలతో ఈ లిస్టు రూపొందించగా అత్యధిక విభాగాల్లో ఉన్నతంగా నిలిచిన స్విట్జర్లాండ్‌ తొలి స్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు మొత్తంగా ఏడుసార్లు ఈ దేశం ‘బెస్ట్‌ కంట్రీ(Best Country)’గా నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సాధించడం గమనార్హం.

ఇక ఈ జాబితాలో బెస్ద్ కంట్రీస్​గా రెండో స్థానంలో జపాన్‌ (Japan) నిలిచింది. మూడో స్థానంలో అమెరికా (America), నాలుగులో కెనడా (Canada), ఐదులో ఆస్ట్రేలియా (Australia) దేశాలు నిలిచాయి. ఈ జాబితాలో భారత్‌ (India) 33వ స్థానం దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే మన దేశం మూడు స్థానాలకు కిందకు పడిపోయింది. ఆసియా నుంచి జపాన్‌, సింగపూర్‌, చైనా, దక్షిణ కొరియా మాత్రమే ఇప్పటివరకు టాప్‌ 25లో చోటు దక్కించుకున్నాయి.

Share post:

లేటెస్ట్