CM Reventh:ప్రధాని మోదీ రెండింతల అప్పులు చేశారు: రేవంత్‌రెడ్డి

ManaEnadu:అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్‌ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్న డిమాండ్‌తో ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులున్నాయని తెలిపారు. 16 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారని ఆరోపించారు. మోదీ తన పరివారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీ చెరబట్టారని దుయ్యబట్టారు.

హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం వద్ద రాష్ట్ర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. వర్సిటీలు, ప్రాజెక్టులను మొదలుపెట్టిన దార్శనిక ప్రధాని నెహ్రూ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ భూసంస్కరణలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు భూములు పంచారని తెలిపారు. రాజీవ్‌గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లే ఐటీ అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు ఆర్థికసంస్కరణలు తెచ్చి ప్రపంచానికే మార్గదర్శకం చేశారని పేర్కొన్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ సంపదను అదానీ దోచుకున్నారని ఆరోపించారు. అదానీ దోపిడీపై రాహుల్‌గాంధీ పార్లమెంటులో ప్రశ్నించారని గుర్తు చేశారు. దేశ సంపదను కాపాడేందుకు కాంగ్రెస్‌ పోరాడుతుందని.. అన్ని ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు చేస్తున్నామని తెలిపారు. అదానీ దోపిడీ చేసిన సంపదను ప్రజలకు చేరవేసేంతవరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆస్తులు కాపాడేందుకే ఈడీ కార్యాలయం ముందు నిరసనలు చేస్తున్నామని వెల్లడించారు. సెబీ ఛైర్మన్‌ అక్రమాలపై జేపీసీ వేయాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *