ManaEnadu:భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకెఎస్ తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కొండపర్తి గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఖమ్మం (Khammam) జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా చెరువు లకు గండి పడి భారీగా నష్టం కలిగిందన్నారు.
పంటలకు తీరని నష్టం కలిగించే అవకాశముందని వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పొలాలు పరిశీలించి పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. ప్రభుత్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలబడాలని, తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులను నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
మిర్చి,పెసర,వరి పంటలు నీట మునిగి పెద్దఎత్తున నష్టపోవడంజరిగిందన్నారు.కేవలం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలే కాకుండా ప్రతి గ్రామంలో తక్షణమే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నీట మునిగిన పంట పొలాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.







