“మన్మయి” సినిమా టీజర్ విడుదల

Mana Enadu:G2H మీడియా పతాకంపై సంతోష్ కృష్ణ, వైష్ణవి కృష్ణ, సిజు మీనన్,ప్రధాన పాత్రధారులుగా పులుగు రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో, నిర్మాతలు రామకృష్ణారెడ్డి, శ్రీహరి రెడ్డి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్టైనర్ “మన్మయి”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరణ జరుపుకుంది.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “మన్మయి” టీజర్ లాంఛ్ కు రమ్మని డైరెక్టర్ రామకృష్ణరెడ్డి నన్ను ఇన్వైట్ చేశారు. కొన్ని స్టిల్స్ చూపించారు. బాగున్నాయనిపించింది. ఇక్కడకి వచ్చి టీజర్ చూశాక మంచి కంటెంట్ తో సినిమా చేస్తున్నట్లు అర్థమైంది. “మన్మయి” సినిమా మీ ఆదరణ పొందాలి. మంచి సక్సెస్ కావాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ పులుగు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – “మన్మయి” ఒక ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది.

నిర్మాత శ్రీహరి రెడ్డి మాట్లాడుతూ – మా “మన్మయి” సినిమా టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ రోజు మా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మంచి లవ్ స్టోరీతో మిమ్మల్ని మూవీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ – మా “మన్మయి” సినిమా టీజర్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా మూవీ టీజర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సంతోష్ కృష్ణ మాట్లాడుతూ – నాకు ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన మా బ్రదర్ రామకృష్ణా రెడ్డి గారికి థ్యాంక్స్. మా మన్మయి మూవీ టీజర్ స్క్రీన్ మీద మీరు చూసి చప్పట్లు కొట్టగానే చాలా సంతోషంగా అనిపించింది. మీకు టీజర్ నచ్చిందంటే మా వర్క్ నచ్చిందనే భావిస్తున్నాం. 

నటుడు శిజు మాట్లాడుతూ – దేవి సినిమాతో మీ అందరికీ గుర్తుండిపోయాను. ఆ సినిమా రిలీజై పాతికేళ్లవుతోంది. డైరెక్టర్ గారు “మన్మయి” కథ చెప్పినప్పుడు ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అనిపించింది. ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్ కలిగించే సినిమా అవుతుంది.

హీరోయిన్ వైష్ణవి కృష్ణ మాట్లాడుతూ – “మన్మయి” సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషనల్ రోలర్ కోస్టర్ సినిమా అనుకోవచ్చు. తెలుగు మూవీస్ లో ఒక క్లాసిక్ గా మిగిలిపోతుందని చెప్పగలను. అమేజింగ్ టీమ్ తో వర్క్ చేశాను. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *